ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ ఛారిటీ క్రికెట్ మ్యాచ్‌లో(Charity match fight) ఆటగాళ్ల మధ్య వివాదం చెలరేగింది. ప్లేయర్స్ ఒకరినొకరు బ్యాట్లతో తీవ్రంగా కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరి తలలకు బలంగా దెబ్బలు తగిలాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
-
A charity cricket match was abandoned after a fight that saw players striking each other with bats broke out between two teams. pic.twitter.com/NcPGRmYA8s
— msc media (@mscmedia2) July 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">A charity cricket match was abandoned after a fight that saw players striking each other with bats broke out between two teams. pic.twitter.com/NcPGRmYA8s
— msc media (@mscmedia2) July 20, 2021A charity cricket match was abandoned after a fight that saw players striking each other with bats broke out between two teams. pic.twitter.com/NcPGRmYA8s
— msc media (@mscmedia2) July 20, 2021
అసలేం జరిగిందంటే?
పాకిస్థాన్‌లో వైద్యం అవసరమైన పేదల కోసం విరాళాలు సేకరించేందుకు మైడ్‌స్టోన్‌లోని మోటే పార్క్ క్రికెట్ క్లబ్లో ఓ ఛారిటీ మ్యాచ్‌ను నిర్వహించారు. అయితే మంచి ఉద్దేశంతో నిర్వహించిన ఈ మ్యాచ్ చివరికి రక్తసిక్తంగా మారింది. గొడవ జరగడానికి కారణం తెలియరాలేదు. కానీ ఈ వీడియో వైరల్ అయింది. ఇందులో ఆటగాళ్లు బ్యాట్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కనిపించారు. చుట్టుపక్కలవాళ్లు వారిని ఆపేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి ఇద్దరు ఆటగాళ్ల తలలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది.
ఈ వివాదంపై మ్యాచ్ నిర్వహకుడు షెహజాద్ స్పందిస్తూ.. "ఇది ఫైనల్ మ్యాచ్. మరో రెండు ఓవర్లో మ్యాచ్ ముగిసిపోతుందనగా.. కొంతమంది పిచ్‌పైకి వచ్చి ఆటగాళ్లపై దాడి చేశారు. ఈ గొడవకు కారణం తెలియరాలేదు. బ్యాట్లతో కొట్టుకున్నారు. ఆ సమయంలో నేను అక్కడ లేను. అక్కడికి వచ్చేసరికి వారు కొట్టుకోవడం, తిట్టుకోవడం చేస్తున్నారు." అని అన్నారు.
ఇదీ చూడండి: Ind Eng Series 2021: కోహ్లీ, రహానె తొలి టెస్టు ఆడేనా?