ETV Bharat / sports

వరల్డ్​ కప్​ ట్రోఫీకి అవమానం- మిచెల్​ మార్ష్​పై కేసు నమోదు- జీవితకాల నిషేధం! - మిచెల్​ మార్ష్​పై మహ్మద్ షమీ కామెంట్లు

Case Filed On Australia Player Mitchell Marsh : వరల్డ్​ కప్​ ట్రోఫీపై కాళ్లు పెట్టి అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్​పై కేసు నమోదైంది. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వివరాలు మీకోసం.

Case Filed On Australia Player Mitchell Marsh

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 4:28 PM IST

Updated : Nov 24, 2023, 6:11 PM IST

Case Filed On Australia Player Mitchell Marsh : ఇటీవల ముగిసిన వరల్డ్​ కప్​లో టీమ్ఇండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించి ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే కప్పు తీసుకున్నాక ఆసీస్​ ప్లేయర్లందరూ ఉత్సాహంగా ట్రోఫీతో ఫొటోలు దిగారు. అనంతరం డ్రెస్సింగ్​ రూమ్​లోకి కప్పును తీసుకెళ్లాక.. ఆసీస్​ ప్లేయర్​ మిచెల్​ మార్ష్​ దానిపై కాళ్లు వేసి అభ్యంతరకరంగా ఫొటోలు దిగాడు. ఈ ఫొటో సోషల్​ మీడియాలో తెగ వైరల్ అయింది. భారత క్రికెట్​ అభిమానులు మార్ష్​ చర్యపై దుమ్మెత్తిపోశారు. వరల్డ్ కప్​ను ఎలా గౌరవించాలో మార్ష్​కు తెలియదంటూ.. భారత ప్లేయర్లను చూసి నేర్చుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Dear sir. Can you take any action on this. If they don't have respect and value and even ICC regulatory value need to take back trophy and need to strick action against capton and Michel marsh.@ICC@cricketworldcup pic.twitter.com/XlWn0zvPc7

    — छोरा गंगा किनारे वाला 🇮🇳 (@nirajshksp88) November 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మిచెల్ మార్ష్​పై కేసు నమోదైంది. మార్ష్‌.. వరల్డ్‌కప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టి భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపిస్తూ అలీగఢ్​కు చెందిన పండిట్ కేశవ్​ అనే ఆర్‌టిఐ కార్యకర్త దిల్లీ గేట్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించాడు. కేశవ్ ఫిర్యాదును స్వీకరించిన దిల్లీ గేట్ పోలీసులు.. మార్ష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

మిచెల్ మార్ష్‌ చర్య ప్రతిష్టాత్మకమైన ట్రోఫీకే కాకుండా 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసిందని.. భారతీయులకు అవమానం కలిగించిందని ఫిర్యాదులో ఆరోపించాడు. కేశవ్‌.. ఫిర్యాదు కాపీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు కూడా పంపించాడు. మిచెల్ మార్ష్‌‌ ఇండియాలో ఎలాంటి క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడకుండా, విదేశాల్లోనూ టీమ్​ఇండియాతో ఆడకుండా జీవితకాలం పాటు నిషేధించాలని కేశవ్ డిమాండ్ చేశాడు.

ఆ ఫొటో చూసి బాధపడ్డాను : షమీ
మిచెల్​ మార్ష్​ ఉదంతంపై టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ స్పందించాడు. ఆ ఫొటో చూసి తాను హర్ట్ అయినట్లు తెలిపాడు. 'ఆ ట్రోఫీ కోసం ప్రపంచ‌ంలోని టీమ్​లు అన్నీ పోటీపడతాయి. అటువంటి ట్రోఫీని ఎల్లప్పుడూ తల కంటే ఎత్తులో ఉంచాలని అనుకోవాలి. అలాంటి వరల్డ్​ కప్ ట్రోఫీపై కాళ్లు ఉంచడం నాకు మాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు" అని అంటూ విలేకరులకు షమీ చెప్పాడు.

నన్ను నేనే అలా ప్రశ్నించుకునేవాడిని- అదే ఇప్పుడు సాయం చేసింది : ఇషాన్‌ కిషన్‌

మహిళల ప్రీమియర్ లీగ్​కు బీసీసీఐ సన్నాహాలు- WPL 2024 వేలం అప్పుడే!

Last Updated : Nov 24, 2023, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.