కోహ్లీ(టీమ్ఇండియా), సర్ఫరాజ్ అహ్మద్(పాకిస్థాన్ మాజీ) కెప్టెన్సీ ఒకేలా ఉంటుందని అన్నాడు దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్(Faf du plesis) డుప్లెసిస్. జట్టును ముందుండి నడిపించడంలో వీరిద్దరి శైలి ఒకే తరహాలో ఉంటుందని చెప్పాడు. అయితే వీరిద్దరితో పోలిస్తే భారత జట్టు మాజీ కెప్టెన్ ధోనీ సారథ్యం భిన్నమైనదని వెల్లడించాడు.
"సర్ఫరాజ్ లాగే కోహ్లీ(Kohli) కూడా మైదానంలో దూకుడుగా ఉంటాడు. ఇద్దరి కెప్టెన్సీ ఒకేలా ఉంటుంది. కానీ మహీ(Dhoni) చాలా కూల్‌గా, రిజర్వ్డ్గా ఉంటాడు. సందర్భానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవడంలో అతడే ఉత్తమం. ఏదేమైనప్పటికీ జట్టును నడిపించడంలో ఎవరి శైలి వారికి ఉంటుంది" అని డుప్లెసిస్ వివరించాడు.
జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో పాల్గొననున్నాడు డుప్లెసిస్. ఈ టోర్నీలో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడనున్నాడు. ఐపీఎల్లో ఇతడు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇదీ చూడండి Kohli: ధోనీ గురించి కోహ్లీ రెండు మాటల్లో