Bumrah World Cup Powerplay: టీమ్ఇండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. గత కొన్నేళ్లుగా భారత జట్టు బౌలింగ్ దళంలో కీలకంగా కొనసాగుతున్నాడు. గుడ్ లైన్ అండ్ లెంగ్త్‌తో పర్ఫెక్ట్ యార్కర్లు సంధించే బుమ్రా.. కొద్ది కాలంలోనే యార్కర్ కింగ్‌గా పేరొందాడు. ఇక టీమ్ఇండియాకు పవర్ ప్లే, డెత్ ఓవర్లలో బుమ్రా ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వెన్నునొప్పి గాయంతో దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన బుమ్రా.. మళ్లీ పాత లయను దొరకబుచ్చుకున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ రాణిస్తూ.. టీమ్ఇండియాకు ప్రధాన ఆటగాడిగా మారాడు. ఈ క్రమంలోనే బుమ్రా కొన్ని కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేస్తున్నాడు.
అక్టోబర్ 22 ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా.. తొలి పవర్ ప్లేలో నాలుగు ఓవర్ల బౌలింగ్ చేశాడు. ఈ స్పెల్‌లో అతడు కివీస్ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశాడు. కేవలం 2.75 ఎకనమీతో 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్ మొత్తంలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 45 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇందులో ఓ మెయిడెన్ ఓవర్ కూడా ఉంది.
బుమ్రా తన వన్డే వరల్డ్‌కప్ కెరీర్లో తొలి పవర్ ప్లే (1-10 ఓవర్లు)లో 330 బంతుల్ని సంధించాడు. ఇందులో ఏకంగా 253 బంతులు డాట్‌బాల్స్ అయ్యాయి. ఇందులో 162 పరుగులిచ్చి.. మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు. అంటే సగటున 23 పరుగులుకు ఓ వికెట్ తీసినట్టు.
ఇక ప్రపంచకప్ కెరీర్లో బుమ్రా.. ఇప్పటివరకూ 14 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో మొత్తం 29 వికెట్లు పడగొట్టాడు. 4-39 అతడి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో కూడా బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు నేలకూల్చాడు. ఈ క్రమంలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఓవరాల్‌గా టీమ్ఇండియా నుంచి వరల్డ్‌కప్‌లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన లిస్ట్‌లోనూ టాప్ 5లో కొనసాగుతున్నాడు.
వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టీమ్ఇండియ బౌలర్లు..
- జహీర్ ఖాన్ - 44 వికెట్లు
- జగవల్ శ్రీనాథ్ - 44 వికెట్లు
- మహ్మద్ షమీ - 36 వికెట్లు
- అనిల్ కుంబ్లే - 31 వికెట్లు
- జస్ప్రీత్ బుమ్రా - 29 వికెట్లు
-
A Bumrah breakthrough and a fantastic Virat Kohli running catch 😎
— BCCI (@BCCI) October 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
New Zealand 257/6 with three overs to go!
Follow the match ▶️ https://t.co/Ua4oDBM9rn#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/byanjxFM15
">A Bumrah breakthrough and a fantastic Virat Kohli running catch 😎
— BCCI (@BCCI) October 22, 2023
New Zealand 257/6 with three overs to go!
Follow the match ▶️ https://t.co/Ua4oDBM9rn#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/byanjxFM15A Bumrah breakthrough and a fantastic Virat Kohli running catch 😎
— BCCI (@BCCI) October 22, 2023
New Zealand 257/6 with three overs to go!
Follow the match ▶️ https://t.co/Ua4oDBM9rn#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/byanjxFM15
-
Ind vs Nz World Cup 2023 : గిల్, షమీ అరుదైన రికార్డులు.. తొలి బ్యాటర్‌గా శుభ్‌మన్ ఘనత
Ind vs Nz World Cup 2023 : కివీస్‌పై భారత్ గ్రాండ్ విక్టరీ.. ఐదో విజయంతో టాప్‌లోకి టీమ్ఇండియా