ETV Bharat / sports

ICC Ranking: టాప్​-10లోకి బుమ్రా- ఐదుకు పడిపోయిన కోహ్లీ - ఐసీసీ వరల్డ్​కప్​

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో (ICC Ranking) భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. ఐదో స్థానానికి పడిపోయాడు. టీమ్​ ఇండియా బౌలర్​​ బుమ్రా.. తిరిగి టాప్​-10లోకి ప్రవేశించాడు. టీ-20 ఆల్​రౌండర్ల జాబితాలో షకీబ్​ మళ్లీ అగ్రస్థానానికి చేరాడు.

ICC Ranking
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​
author img

By

Published : Aug 11, 2021, 3:33 PM IST

ఇంగ్లాండ్​తో తొలి టెస్టులో (ICC Ranking) అద్భుత ప్రదర్శన చేసిన భారత పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా.. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్​లో మళ్లీ టాప్​-10లోకి ప్రవేశించాడు. 10 స్థానాలు మెరుగుపర్చుకొని.. ప్రస్తుతం 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. నాటింగ్​హామ్​ టెస్టులో రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి మొత్తం 9 వికెట్లు తీశాడు. 2019 సెప్టెంబర్​లో కెరీర్​లో అత్యుత్తమంగా మూడో స్థానానికి చేరిన బుమ్రా.. ఆ తర్వాత క్రమక్రమంగా దిగువకు పడిపోయాడు.

ICC Test Players rankings
జస్​ప్రీత్​ బుమ్రా

కొద్దిరోజులుగా సుదీర్ఘ ఫార్మాట్లో (ICC Ranking) అంచనాలను అందుకోలేకపోతున్న సారథి విరాట్​ కోహ్లీ (Virat Kohli).. బ్యాట్స్​మెన్​ ర్యాంకింగ్స్​లో ఐదుకు పడిపోయాడు. ఇంగ్లాండ్​పై తొలి ఇన్నింగ్స్​లో డకౌట్​ కావడం వల్ల.. ఓ స్థానం కోల్పోయాడు విరాట్​.

ICC Test Players rankings
విరాట్​ కోహ్లీ

తొలి టెస్టులో వరుసగా 64, 109 పరుగులు చేసిన ఇంగ్లాండ్​ టెస్టు కెప్టెన్​ జో రూట్​.. నాలుగో స్థానానికి ఎగబాకాడు.

భారత ఓపెనర్​ రోహిత్​ శర్మ, వికెట్​ కీపర్​ రిషభ్​ పంత్​ 6,7 స్థానాల్లో కొనసాగుతున్నారు.

తొలి టెస్టులో మంచి ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజా 36, కేఎల్​ రాహుల్​ 56 స్థానాల్లో ఉన్నారు.

బౌలర్లలో..

బౌలర్ల ర్యాంకింగ్స్​లో రవిచంద్రన్​ అశ్విన్​ రెండో స్థానంలోనే ఉన్నాడు. ఆసీస్​ పేసర్​ ప్యాట్​ కమిన్స్​ది తొలి స్థానం. శార్దుల్​ ఠాకుర్​ 19 స్థానాలు మెరుగు పర్చుకుని, 55వ స్థానంలో నిలిచాడు.

టీ-20ల్లో..

బంగ్లాదేశ్​ ఆటగాడు షకీబుల్​ హసన్​.. టీ-20 ఆల్​రౌండర్ల జాబితాలో తిరిగి అగ్రస్థానం దక్కించుకున్నాడు. బ్యాట్స్​మెన్​ జాబితాలో 53, బౌలర్ల జాబితాలో 12లో కొనసాగుతున్నాడు. బంగ్లా బౌలర్​.. ముస్తఫిజుర్​ రెహ్మాన్​.. తిరిగి టాప్​-10లోకి ప్రవేశించాడు.

ఇదీ చూడండి: కోచ్​ పదవికి రవిశాస్త్రి గుడ్​బై!.. ద్రవిడ్​పైనే అందరి దృష్టి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.