గాయం కారణంగా ఆసియా కప్‌నకు దూరమైన టీమ్‌ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. తాజాగా ప్రకటించిన టీ20 ప్రపంచకప్ జట్టుతో తిరిగి టీమ్‌లోకి వచ్చాడు. టీ20 ప్రపంచకప్‌తో పాటు ఆసీస్, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు ఈ పేసు గుర్రాన్ని సెలెక్టర్లు ఎంపిక చేశారు.
దీంతో గాయం నుంచి కోలుకున్న అతడు కఠోర సాధన ప్రారంభించాడు. సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌ను ప్రారంభం కానుంది. దీంతో టీ20 ప్రపంచకప్ నాటికి ఫామ్‌లోకి వచ్చేందుకు బుమ్రాకు చక్కని అవకాశం దొరికింది. ఇక తన బౌలింగ్‌లో లయను పెంచుకునేందుకు నెట్స్‌లో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సాధనకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కాగా, అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రపంచ కప్ కోసం భారత్ 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది. అలాగే నలుగురిని స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. ఆసీస్, దక్షిణాఫ్రికా సిరీస్‌లకూ జట్లను ప్రకటించింది. సెప్టెంబర్ 28 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, పేసర్ భువనేశ్వర్ కుమార్ అందుబాటులో ఉంటడం లేదని బీసీసీఐ తెలిపింది.
ఇదీ చూడండి: మళ్లీ అదరగొట్టేసిన కోహ్లీ.. ఈ సారి ఎందులో అంటే