ETV Bharat / sports

'ధైర్యం కోల్పోలేదు.. గాయం నుంచి కోలుకుని జట్టును ఉత్సాహపరుస్తా' - బుమ్రా గాయం

ICC T20 World Cup 2022 : టీమ్‌ఇండియా పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలిగినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో.. త్వరలోనే గాయం నుంచి కోలుకుని జట్టుకు మద్దతుగా నిలుస్తానని బుమ్రా ఆశాభావం వ్యక్తం చేశాడు.

ICC T20 World Cup 2022
ICC T20 World Cup 2022
author img

By

Published : Oct 4, 2022, 10:43 PM IST

ICC T20 World Cup 2022 : టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలిగినట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. వెన్ను గాయం కారణంగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌ మధ్యలోనే నిష్క్రమించిన ఈ ఫాస్ట్‌ బౌలర్‌.. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు సైతం దూరమయ్యాడు. తాజాగా ఈ అంశంపై బుమ్రా స్పందించాడు. ఈ సిరీస్‌కు దూరమైనా తానింకా ధైర్యంగానే ఉన్నానని తెలిపాడు. త్వరలోనే గాయం నుంచి కోలుకుని జట్టుకు మద్దతుగా నిలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"ఈసారి టీ20 ప్రపంచకప్‌లో భాగం కాలేకపోతున్నా.. అయినా నేను ధైర్యం కోల్పోలేదు. నేను కోలుకోవాలని కోరుకుంటూ మద్దతుగా నిలిచిన నా ఆత్మీయులందరికీ ధన్యవాదాలు. గాయం నుంచి త్వరలోనే కోలుకుని నా జట్టును ఉత్సాహపరుస్తా" అంటూ ట్విటర్‌ వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. అతడి ట్వీట్‌ను బీసీసీఐ రీట్వీట్‌ చేసింది. 'త్వరగా కోలుకోవాలి' అంటూ ఆకాంక్షించింది. అయితే బుమ్రా స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేసే పనిలో బీసీసీఐ ఉంది.

క్రికెటర్ల భావోద్వేగం..
టీ20 ప్రపంచకప్‌లో కచ్చితంగా పాల్గొంటాడని ఎదురుచూసిన అభిమానులకు బీసీసీఐ ప్రకటన నిరాశనే మిగిల్చింది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ కీలక సిరీస్‌కు బుమ్రా దూరం కావడం క్రికెటర్లను సైతం తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. అతడు లేకుండానే ఆసీస్‌ పర్యటనకు వెళ్తుండటం బాధగా ఉందంటూ టీమ్‌ఇండియా ఆటగాళ్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ భావోద్వేగాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.

"బుమ్రా.. నువ్వు త్వరగా కోలుకోవాలి. అంతే బలంగా తిరిగి రావాలి" అంటూ సూర్యకుమార్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశాడు. "జస్సీ.. నువ్వు ఎప్పటిలాగే బలమైన రీఎంట్రీ ఇవ్వాలి" అంటూ కింగ్‌ సింబల్‌తో పాటుగా లవ్‌ ఎమోజీని హార్దిక్‌ పాండ్యా పోస్ట్‌ చేశాడు. ఈ టోర్నీకి దూరం కావడంపై ఇప్పటికే స్పందించిన బుమ్రా తన శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశాడు.

ఇవీ చదవండి: మహిళల ఆల్​రౌండ్ షో.. ఆసియా కప్‌లో హ్యాట్రిక్‌ విన్.. టేబుల్​లో అగ్రస్థానం

పంత్​కు ఊర్వశి 'స్పెషల్' బర్త్​డే విషెస్.. రెడ్ హాట్ లుక్​లో ఫ్లయింగ్ కిస్..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.