ETV Bharat / sports

'బుమ్రా వైస్​కెప్టెన్​ అవ్వడం ఆశ్చర్యమేసింది' - బుమ్రా వైస్​ కెప్టెన్​

Bumrah vice captain: దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్​కు బుమ్రాను వైస్​కెప్టెన్​గా నియమించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నాడు టీమ్​ఇండియా మాజీ సెలక్టర్​, వికెట్​ కీపర్​ సబా కరీమ్​. వైస్ కెప్టెన్సీకి మొదటి ప్రాధాన్యంగా రిషభ్‌ పంత్ ఉంటాడని భావించినట్లు తెలిపాడు.

bumrah
బుమ్రా
author img

By

Published : Jan 3, 2022, 8:00 AM IST

Bumrah vice captain: త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా నియామకం కావడం పట్ల భారత మాజీ సెలెక్టర్‌, వికెట్ కీపర్ సబా కరీమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం నుంచి కోలుకోపోవడం వల్ల ఆ బాధ్యతలను వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు అప్పగించారు. రాహుల్‌ కెప్టెన్సీ బాధ్యతలు చూస్తుండటం వల్ల ఉప సారథిగా సీనియర్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను నియమించారు. అయితే, ఐపీఎల్‌లో కెప్టెన్సీ అనుభవం ఉన్న రిషభ్‌ పంత్, శ్రేయాస్‌ అయ్యర్‌లలో ఎవరైనా ఒకరిని వైస్‌ కెప్టెన్‌గా నియమిస్తారని చాలామంది క్రికెట్ విశ్లేషకులు భావించారు. కానీ, చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ బుమ్రాను వైస్‌ కెప్టెన్‌గా ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అంశంపై సబా కరీమ్‌ మాట్లాడారు. శ్రేయాస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ను కాకుండా బుమ్రాను వైస్‌ కెప్టెన్‌గా నియమిస్తారని అస్సలు ఊహించలేదన్నాడు.

"నేను ఈ విషయం తెలియగానే చాలా ఆశ్చర్యానికి గురయ్యా. జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్ అవుతాడని ఊహించలేదు. రిషబ్‌ పంత్‌కు వైస్‌ కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నాను. ఎందుకంటే అతడు మల్టీ ఫార్మాట్‌ ప్లేయర్‌. మూడు ఫార్మాట్‌లలో ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా పంత్ అద్భుతంగా రాణించాడు. అతను మ్యాచ్‌లను ఎలా అర్థం చేసుకుంటున్నాడో మనం చూస్తున్నాం. పంత్‌కు కెప్టెన్సీపై అవగాహన ఉంది. జస్ప్రీత్ బుమ్రాకు ప్రతిభ ఉంది. అతడు భారత జట్టుకు చాలా కీలకమైన ఆటగాడు. కానీ, అతడికి ఇప్పటివరకు కెప్టెన్సీ అనుభవం లేదు. వైస్ కెప్టెన్సీకి మొదటి ప్రాధాన్యంగా రిషభ్‌ పంత్ ఉంటాడని భావించా" అని సబా కరీమ్‌ పేర్కొన్నాడు. సౌతాఫ్రికా, భారత్ మధ్య తొలి వన్డే జనవరి 19, రెండో వన్డే జనవరి 21, మూడో వన్డే జనవరి 23న జరగనున్నాయి.

ఇదీ చూడండి: IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. సిరీస్​పై కన్నేసిన భారత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.