ETV Bharat / sports

టీమ్​ఇండియా బస్​లో బుల్లెట్ల కలకలం! - బస్​లో బుల్లెట్ల కలకలం

మొహలీ వేదికగా మరికొద్ది రోజుల్లో టెస్టు మ్యాచ్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో స్థానికంగా బుల్లెట్ షెల్స్​ దొరకడం కలకలం సృష్టించింది. టీమ్​ఇండియాకు కేటాయించిన బస్సులోని లగేజ్​ బాక్స్​లో వీటిని గుర్తించారు అధికారులు.

team india
టీమ్​ఇండియా బస్​లో బుల్లెట్ల కలకలం
author img

By

Published : Feb 27, 2022, 4:40 PM IST

Updated : Feb 27, 2022, 5:15 PM IST

శ్రీలంకతో టీ20 సిరీస్​ ఆడుతున్న టీమ్​ఇండియా వచ్చే నెల నుంచి టెస్టు మ్యాచ్​ల్లో తలపడనుంది. మొహలీ వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్​కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా ఆటగాళ్ల కోసం కేటాయించిన బస్​లోని లగేజ్​ బాక్స్​లో రెండు బుల్లెట్​ షెల్స్​ లభ్యమవడం కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం ఆటగాళ్లను హోటల్​ నుంచి స్టేడియంకు తరలించేముందు నిర్వహించిన తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి.

ఈ ఘటనపై పోలీసులు, భద్రతా సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. టీమ్​ఇండియా కోసం కేటాయించిన బస్సును సంబంధిత యజమాని అంతకుముందు ఓ వివాహ వేడుకకు కేటాయించారని పోలీసులు వెల్లడించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : IND VS SL: వారికి ఒక్క అవకాశం చాలు: రోహిత్​ శర్మ

Last Updated : Feb 27, 2022, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.