ETV Bharat / sports

భారత్​పై ప్రేమ.. విండీస్​ క్రికెటర్​ కుమార్తెకు ఇక్కడి గ్రౌండ్ పేరు - brathwaite news updates

Brathwaite News: వెస్టిండీస్​ ఆల్​రౌండర్​ బ్రాత్​వైట్​ తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని అతడు ఇన్​స్టా వేదికగా వెల్లడించాడు. తన కుమార్తెతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. అయితే ఆ చిన్నారికి భారత్​లోని ఓ క్రికెట్​ మైదానం పేరు పెట్టడం విశేషం​.

Brathwaite news
Brathwaite news
author img

By

Published : Feb 9, 2022, 1:24 PM IST

Brathwaite News: వెస్టిండీస్​ ఆల్​రౌండర్ కార్లోస్ బ్రాత్​వైట్​ తండ్రి అయ్యాడు. అతడి భార్య, ఈనెల 6న ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఇతడు​ ఇన్​స్టా వేదికగా వెల్లడించాడు. తమ కుమార్తెకు కోల్​కతాలోని క్రికెట్ మైదానం 'ఈడెన్ గార్డెన్స్​'లో ఈడెన్​ను తీసుకుని 'ఈడెన్​ రోజ్'​​ అని పేరు పెట్టినట్లు చెప్పాడు. ఆమెతో తీసుకున్న ఫొటోను సోషల్​ మీడియాలో షేర్​ చేశాడు. ఆ పేరు పెట్టడానికి గల కారణాన్ని తెలిపాడు.

2016 ప్రపంచకప్ ఫైనల్​లో ఈడెన్ గార్డెన్స్​లోనే నాలుగు సిక్సులు కొట్టి తమ జట్టుకు ప్రపంచకప్​ అందించాడు బ్రాత్​వైట్. ఈడెన్ గార్డెన్స్.. తనకు పేరు తెచ్చిందని అందుకే తమ చిన్నారి పేరులో ఈడెన్ అని చేర్చినట్లు చెప్పాడు.

Brathwaite daughter name Eden Gardens
కుమార్తెతో క్రికెటర్ బ్రాత్​వైట్

"ఈడెన్ రోజ్ బ్రాత్‌వైట్ పేరును గుర్తుంచుకో. నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తానని నాన్న వాగ్దానం చేశాడు. ధన్యవాదాలు జెస్సీ. నువ్వు దృఢంగా ఉన్నావ్​.. అలాగే ఉంటావు కూడా. నువ్వు అద్భుతమైన తల్లి అవుతావని నాకు తెలుసు. మీ ఇద్దరినీ ప్రేమిస్తున్నాను" అని వైట్​ తన ఇన్​స్టాలో రాసుకొచ్చాడు.

2016 టీ20 ప్రపంచకప్​​ ఫైనల్‌లో కామెంటరీ బాక్స్‌లో ఉన్న మాజీ వెస్టిండీస్​ క్రికెటర్​ ఇయాన్​ బిషప్..​ వెస్టిండీస్ ఆల్​రౌండర్ ఆటను ప్రశంసిస్తూ.. 'కార్లోస్ బ్రాత్‌వైట్ పేరును గుర్తుంచుకోండి' అని వ్యాఖ్యానించాడు. అదే పోస్టును సూచిస్తూ.. ఈ విధంగా రాసుకొచ్చాడు బ్రాత్​వైట్​.

చివరిసారి 2019 ఆగస్టులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన బ్రాత్​వైట్​.. మళ్లీ టీమ్​లో చోటు దక్కించుకోలేకపోయాడు. గతేడాది టీ20 ప్రపంచకప్​నకు అతడిని ఎంపిక చేయలేదు. కెరీర్​లో ఇప్పటివరకు మూడు టెస్టులు, 44 వన్డేలు, 41 టీ20 ఆడాడు.

ఆస్ట్రేలియా క్రికెటర్​ వార్నర్ కూడా తన కూతురికి ఇండీ అనే పెట్టి.. భారత్​పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

ఇదీ చూడండి: విండీస్​ టూర్​కు ఇంగ్లాండ్ స్టార్స్​ దూరం.. ఫ్యాన్స్​ అసహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.