Bradman bat auction: క్రికెట్ చరిత్రలో భాగమైన.. దిగ్గజ డొనాల్డ్ బ్రాడ్‌మన్ బ్యాట్ వేలానికి వచ్చింది. 1934 యాషెస్ సిరీస్‌లో ఈ బ్యాట్‌తోనే ఆయన రెండు త్రిశతకాలు సాధించారు. ఓపెనర్ బిల్ పోన్స్ఫోర్డ్తో కలిసి 451 పరుగుల అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి దీనినే ఉపయోగించారు.
న్యూసౌత్ వేల్స్ సదర్న్ హైలాండ్స్‌లోని బౌరల్లో ఉన్న బ్రాడ్‌మన్ మ్యూజియంలో ఈ బ్యాట్‌ను 1999 నుంచి ప్రదర్శనకు ఉంచారు. 52 టెస్టుల్లో 99.94 సగటుతో 6996 పరుగుల చేసిన బ్రాడ్‌మన్.. తన అత్యధిక స్కోర్లను ఈ బ్యాట్‌పై రాశారు.
ఈ బ్యాట్‌ను ఒక నిధిగా అభివర్ణించారు మ్యూజియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రీనా. 2018లో వేలానికి వచ్చిన బ్రాడ్‌మన్ మరో బ్యాట్ 1లక్ష 10 వేల ఆస్ట్రేలియన్ డాలర్లకు (సుమారు రూ.60లక్షలు) అమ్ముడైంది.
ఇదీ చూడండి: సర్ బ్రాడ్‌మన్ టెస్టు క్యాప్‌కు భారీ ధర