ETV Bharat / sports

IND Vs AUS: ఆసీస్​ స్పిన్​ మాయాజాలం.. మూడో టెస్ట్​లో చేతులెత్తేసిన టీమ్​ఇండియా​! - border gavaskar trophy

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్​.. తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా బ్యాటర్లు తడబడ్డారు. ఆసీస్​ స్పిన్నర్ల ధాటికి 33.2 ఓవర్లలోనే ఆలౌటయ్యారు. స్టార్ బ్యాటర్ విరాట్​ కోహ్లీ, యువ ఆటగాడు శుభమన్​ గిల్​ మాత్రమే పర్వాలేదనింపించారు.

border gavaskar trophy team india first innings

author img

By

Published : Mar 1, 2023, 12:49 PM IST

Updated : Mar 1, 2023, 5:34 PM IST

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య కీలకమైన మూడో టెస్టు ఇందౌర్‌లో ప్రారంభమైంది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయం సాధించి జోరు మీద ఉన్న రోహిత్‌ సేన.. మూడో టెస్టులో మాత్రం కాస్త తడబడింది. తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్​ స్పిన్నర్ల ధాటికి 33.2 ఓవర్లలోనే కేవలం 109 పరుగులు చేసి భారత్​ ఆలౌట్​ అయింది. స్టార్ బ్యాటర్ విరాట్​ కోహ్లీ, యువ ఆటగాడు శుభమన్​ గిల్​ మాత్రమే పర్వాలేదనింపించారు. మిగతా వారంతా విఫలమయ్యారు. ఆసీస్​ బౌలర్లలో కున్​మెన్​ ఐదు వికెట్లు పడగొట్టాడు. లైయన్​ మూడు వికెట్లు తీయగా.. మర్ఫీ ఒక్క వికెట్​ పడగొట్టాడు.

ఇక, పరుగుల వీరుడు కింగ్‌ కోహ్లీకి స్వదేశంలో 200వ అంతర్జాతీయ టెస్ట్. తన ప్రత్యేకమైన టెస్టులో విరాట్ నిరాశపర్చాడు. మర్ఫీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో విరాట్‌ భారీ స్కోరు చేసి చాలా కాలమైంది. 2020 నుంచి అతడు ఈ ఫార్మాట్‌లో సెంచరీ నమోదు చేయలేదు. 2020లో మూడు టెస్టులు ఆడితే మొత్తం 116 పరుగులు చేశాడు. ఇక 2021లో 11 మ్యాచ్‌ల్లో 536 పరుగులు, గత ఏడాది ఆరు మ్యాచుల్లో 265 పరుగులు చేశాడు.

Last Updated : Mar 1, 2023, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.