ETV Bharat / sports

కోహ్లీ లాంగ్ డ్రైవ్​.. ఆ ఒక్క ఫొటోతో..

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా దిల్లీ వేదికగా జరగనున్న రెండో టెస్టు గురించి ప్రత్యేకంగా స్పందించాడు టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ. ఏమన్నాడంటే..

kohli
కోహ్లీ లాంగ్ డ్రైవ్​.. ఆ ఒక్క ఫొటోతో..
author img

By

Published : Feb 15, 2023, 6:40 PM IST

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది. ఫలితంగా టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అలా విజయంతో ఫుల్​ జోష్​లో ఉన్న భారత జట్టు.. దిల్లీ వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్​కు సిద్ధమైంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టా వేదికగా ఓ స్పెషల్​ నోట్​ను షేర్ చేశాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత దిల్లీలో టెస్టు మ్యాచ్‌ జరగబోతోంది. తాను పుట్టిన గడ్డపై టెస్టు ఆడనుండటం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.

"చాలాకాలం తర్వాత దిల్లీ స్టేడియం వైపు లాంగ్‌ డ్రైవ్ వెళ్తున్నా. ఇది మాటల్లో వర్ణించలేని అనుభూతి. దిల్లీ పట్ల వ్యామోహ భావన కనిపిస్తోంది" అని విరాట్ రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా కారు డ్రైవ్‌ చేస్తున్న ఇమేజ్‌ను పోస్టు చేశాడు. కాగా, నాగ్‌పుర్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (12) సరిగ్గా ఆడలేకపోయాడు. కొత్త బౌలర్ మర్ఫీ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇప్పుడు సొంత మైదానంలో సెంచరీ సాధించి టెస్టుల్లో తన శతక నిరీక్షణకు తెరదించాలని భావిస్తున్నాడు.

ప్రాక్టీస్​ మ్యాచ్​.. ప్రాక్టీస్​ మ్యాచ్​లో తొలి టెస్టులో చేసిన తప్పిదాలపై టీమ్​ఇండియా ప్రధానంగా దృష్టి పెట్టింది. భారత మిడిలార్డర్ బ్యాటర్లు నెట్స్‌లో స్పిన్ బౌలింగ్‌ను గంటల తరబడి ఎదుర్కొన్నారు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, కేఎల్ రాహుల్‌లు... స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ప్రాక్టీస్ చేశారు. ఇక తొలి టెస్ట్‌లో స్లిప్‌లో రెండు సునాయస క్యాచ్‌లు నేలపాలు చేసిన విరాట్​ను ఫీల్డింగ్ కోచ్ ప్రత్యేక క్లాస్ కూడా తీసుకున్నాడు.

ఇదీ చూడండి: దిల్లీలో రెండో టెస్టు​.. భారత్​ 3 - ఆసీస్​ 1- మూడు సార్లు డ్రా.. ఈ రికార్డ్స్​ తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.