Bizarre Self Out In Cricket Viral Video : పాకిస్థాన్ దేశీయ టీ20 క్రికెట్ లీగ్‌లో వింత ఘటన జరిగింది. అబ్బొట్టబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సియాల్కోట్ టీమ్ బ్యాటర్ అనూహ్య రీతిలో సెల్ఫ్ ఔట్ అయ్యాడు. శనివారం ఈ ఘటన జరిగగా దానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో తెగ తిప్పేస్తున్నారు నెటిజన్లు.
ఔటయ్యాడిలా..!
అబొట్టాబాద్ స్పిన్నర్ యాజిర్ షా వేసిన 12వ ఓవరల్లో సియాల్కోట్ బ్యాటర్ మిర్జా తాహిర్ బాగ్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ సమయంలో బరువునంతా తన వెనుక కాలుపై వేయడం వల్ల కాలు తిమ్మిరెక్కి బ్యాలెన్స్ తప్పాడు. అనంతరం స్టంప్స్‌పై పడిపోయాడు. దీంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఇలా అనూహ్య రీతిలో అనుకోకుండా తాహిర్ సెల్ఫ్ ఔట్ అయ్యాడు. దీంతో నొప్పితో తాహిర్ పెవిలియన్ వైపు వెళ్లిపోయాడు. అయితే ఇలా ఔటవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ట్వీట్టర్లో పోస్ట్ పెట్టింది.
-
Mirza Tahir Baig had a bizarre and unfortunate end to his stay at the crease 😳#NationalT20 | #ABTvSKT | #AajaMaidanMein pic.twitter.com/XdB0uXP4Jb
— Pakistan Cricket (@TheRealPCB) December 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mirza Tahir Baig had a bizarre and unfortunate end to his stay at the crease 😳#NationalT20 | #ABTvSKT | #AajaMaidanMein pic.twitter.com/XdB0uXP4Jb
— Pakistan Cricket (@TheRealPCB) December 2, 2023Mirza Tahir Baig had a bizarre and unfortunate end to his stay at the crease 😳#NationalT20 | #ABTvSKT | #AajaMaidanMein pic.twitter.com/XdB0uXP4Jb
— Pakistan Cricket (@TheRealPCB) December 2, 2023
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సియాల్కోట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. తాహిర్ బాగ్ 29 బంతుల్లో 30 పరుగులు చేసి రాణించాడు. అందులో మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు కూడా బాది సియాల్కోట్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఆ తర్వాత 120 పరగులు లక్ష్యంతో బరిలోకి దిగిన అబొట్టాబాద్ టీమ్ 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్ సజ్జద్ అలీ, అనీస్ అజామ్ మండి స్టార్ట్ ఇచ్చారు.
ఈ రెండు జట్లు ఇప్పటివరకు చెరో రెండు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో విజయం సాధించాయి. +0.665 నెట్ రన్ రేట్‌తో సియాల్కోట్ టీమ్ మూడో స్థానంలో ఉంది. మరోవైపు అబొట్టాబాద్ -0.362 నెట్ రన్ రేట్‌తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఆదివారం సియాల్కోట్, రావల్పిండి జట్లు తలపడ్డాయి. ఇంకో మ్యాచ్‌లో ఫటా, అబొట్టాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
క్రికెట్లో విచిత్రమైన నో బాల్ - వీడియో వైరల్ - మీరు చూశారా?
10,868 పరుగులు - 2 సార్లు వరల్డ్‌కప్ ఫైనల్ చేర్చిన కెప్టెన్ - 20 ఏళ్ల కెరీర్లో మిథాలీ ఘనతలు ఇవే!