వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే కామన్వెల్త్ క్రీడల్లో(commonwealth games 2022) మహిళల క్రికెట్(commonwealth games cricket) పోటీలు భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌తో ప్రారంభం కానున్నాయి. జులై 29న ఈ మ్యాచ్ జరుగుతుంది. టీ20ల రూపంలో తొలిసారి మహిళల క్రికెట్(commonwealth games cricket)ను కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెడుతున్నారు. చివరిగా 1998లో ఈ క్రీడల్లో క్రికెట్ ఆడారు.
"జులై 29 నుంచి మహిళల క్రికెట్ పోటీలు(commonwealth games cricket) ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగబోతున్నాయి. ఆగస్టు 7న స్వర్ణ, కాంస్య పతక మ్యాచ్‌లు నిర్వహిస్తారు" అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.
తొలి రోజు భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్(indw vs ausw t20)తో పాటు పాకిస్థాన్-బార్బడోస్ పోరు కూడా జరగనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జులై 31న భారత్ తలపడబోతోంది. ఈ టోర్నీలో ఆడే ఎనిమిది క్వాలిఫయింగ్ జట్లలో ఇప్పటికే ఏడు జట్లు ఖరారు కాగా.. చివరి జట్టు ఇంకా తేలాల్సి ఉంది.
పూర్తి షెడ్యూల్
గ్రూప్-ఎ
జట్లు | తేదీ |
---|---|
భారత్-ఆస్ట్రేలియా | జులై 29 |
పాకిస్థాన్-బార్బడోస్ | జులై 29 |
భారత్-పాకిస్థాన్ | జులై 31 |
బార్బడోస్-ఆస్ట్రేలియా | జులై 31 |
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ | ఆగస్టు 3 |
భారత్-బార్బడోస్ | ఆగస్టు 3 |
గ్రూప్-బి
జట్లు | తేదీ |
---|---|
న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా | జులై 30 |
ఇంగ్లాండ్-క్వాలిఫయర్ 2 | జులై 30 |
ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా | ఆగస్టు 2 |
క్వాలిఫయర్ 2-న్యూజిలాండ్ | ఆగస్టు 2 |
దక్షిణాఫ్రికా-క్వాలిఫయర్ 2 | ఆగస్టు 4 |
ఇంగ్లాండ్-న్యూజిలాండ్ | ఆగస్టు 4 |
నాకౌట్ మ్యాచ్‌లు
సెమీఫైనల్ 1 | ఆగస్టు 6 |
సెమీఫైనల్ 2 | ఆగస్టు 6 |
కాంస్య పతకపోరు | ఆగస్టు 7 |
ఫైనల్ | ఆగస్టు 7 |