Bhuvneshwar Kumar Ireland: భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డును సాధించాడు. టీ20 ఫార్మాట్లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్ని వికెట్ తీసిన భువి ఈ ఘనత సాధించాడు. ఈ వికెట్‌తో 33 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న వెస్టిండీస్ స్పిన్నర్ శ్యామ్యూల్ బద్రీ, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీని అధిగమించాడు. 32 ఏళ్ల భువనేశ్వర్ ఇప్పటివరకు 64 మ్యాచులాడగా.. 64 వికెట్లు తీశాడు. 121 వన్డేల్లో 141 వికెట్లు, 21 టెస్టుల్లో 63 వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌పై వరుణుడు ప్రభావం చూపడం వల్ల 12 ఓవర్లకు కుదించారు. హార్దిక్ పాండ్య నేతృత్వంలో బరిలోకి దిగిన టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీపక్ హుడా (47 నాటౌట్; 29 బంతుల్లో 6x4, 2x6), ఇషాన్ కిషన్ (26; 11 బంతుల్లో 3x4, 2x6), హార్దిక్ పాండ్య (24; 12 బంతుల్లో 1x4, 3x6) చెలరేగడం వల్ల 109 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 9.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐర్లాండ్ బౌలర్లలో యంగ్ (2/18) ఒక్కడే ప్రభావం చూపాడు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ (3-1-16-1), చాహల్ (3-0-11-1) ప్రత్యర్థిని కట్టడి చేశారు. సిరీస్‌లో చివరిదైన రెండో టీ20 మంగళవారం జరగనుంది.
ఇదీ చదవండి: 'స్టార్ ఆటగాళ్లు లేకపోతేనేం.. ఈ కోచ్ ఉన్నాడుగా.. ఛాంపియన్లను చేయడానికి'