Bhanuka Rajapaksa on Kohli: భారత దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. అతడిని ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌ని కెరీర్‌గా ఎంచుకున్న ఆటగాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి అభిమానుల్లో ఒకడే శ్రీలంక ఆటగాడు భనుక రాజపక్స. తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడిన అతడు.. తన అభిమాన క్రికెటర్ కోహ్లీ గురించి పలు విషయాలు వెల్లడించాడు.
"విరాట్ కోహ్లీ నా అభిమాన క్రికెటర్. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రస్తుత తరం అత్యుత్తమ క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. అతడిలో గొప్ప నాయకత్వ లక్షణాలున్నాయి. ఆట పట్ల కోహ్లీకి ఉన్న అంకితభావం ఎనలేనిది. అతడు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడితే చూడాలని ఉంది"
-- భనుక రాజపక్స, శ్రీలంక క్రికెటర్.
ఎల్‌పీఎల్ నుంచి షాహిద్ అఫ్రీది అర్ధాంతరంగా తప్పుకోవడంతో గాలె గ్లాడియేటర్స్ జట్టుకు రాజపక్స కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 'వ్యక్తిగత కారణాలతో షాహిద్ అఫ్రీది అర్ధాంతరంగా లీగ్ నుంచి తప్పుకోవడంతో నాకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దొరికింది. ఎల్‌పీఎల్‌లో గాలె జట్టుకు నాయకత్వం వహించడం చాలా గొప్పగా ఉంది. ఈ ఏడాది ఛాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నాం' అని రాజపక్స పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:
Virat Kohli Break: 'వన్డే సిరీస్‌కు విశ్రాంతి కావాలని కోహ్లీ కోరలేదు'
వామ్మో.. కోహ్లీ, అనుష్క బాడీగార్డ్ జీతం మరీ అంతా?
SA vs IND Test: 'అసలేం జరుగుతోంది.. దక్షిణాఫ్రికా పర్యటన రద్దు చేయాలా?'