ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో(WTC final) న్యూజిలాండ్ మెరుగైన ప్రదర్శన చేసిందని టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) అన్నాడు. గొప్ప విజయాలు అంత సులువుగా దక్కవని వ్యాఖ్యానించాడు. ప్రతికూల వాతావరణం, పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో టీమ్ఇండియా ఓటమి చవిచూసిన అనంతరం గురువారం ఈ మేరకు ట్వీట్ చేశాడు.
"క్లిష్ట పరిస్థితుల్లో మెరుగైన జట్టే గెలిచింది. ప్రపంచ టైటిల్ కోసం సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న న్యూజిలాండ్.. ఈ విజయానికి అన్ని విధాల అర్హమైనది. గొప్ప విజయాలు అంత సులువుగా రావని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఆ జట్టు బాగా ఆడింది. దానిని గౌరవిస్తున్నా."
- రవి శాస్త్రి, టీమ్ఇండియా ప్రధాన కోచ్
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్ఇండియాపై 8 వికెట్ల తేడాతో కేన్ సేన కప్పు దక్కించుకుంది. కాగా, కోహ్లీ నేతృత్వంలోని టీమ్ఇండియా ఇంకా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా దక్కించుకోలేదు.
ఇవీ చూడండి: