Best Young Cricketers 2023: 2023 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది రెండు ఐసీసీ టోర్నీలు సహా, పలు సిరీస్‌లు జరిగాయి. ఈ క్రమంలో ఆయా దేశాల నుంచి ప్రతిభావంతులైన పలువురు యువ క్రికెటర్లు ప్రపంచానికి పరియచం అయ్యారు. వారెవరో తెలుసుకుందాం.
యశస్వి జైశ్వాల్: 22 ఏళ్ల యంగ్ ప్లేయర్ యశస్వి జైశ్వాల్‌కు 2023 ఏడాది కలిసొచ్చింది. జైశ్వాల్ ఏడాదిలోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. జూలైలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆడిన జైశ్వాల్, తొలి ఇన్నింగ్స్‌లోనే 171 భారీ సెంచరీ సాధించాడు. తర్వాత ఆగస్టులో టీ20లో అరంగేట్రం చేసే ఛాన్స్ పట్టేశాడు. 14టీ20లు ఆడిన ఈ యంగ్ బ్యాటర్ 430 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉండడం విశేషం.
-
Yashasvi Jaiswal in his Debut Test series for India:
— CricketMAN2 (@ImTanujSingh) July 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
171(387).
57(74).
38(30).
3 Innings, 266 runs, 88.68 average, 1 Hundred, 1 fifty - Leading runs scorer in this series. Incredible, Yashasvi. pic.twitter.com/DeEej1b5Uu
">Yashasvi Jaiswal in his Debut Test series for India:
— CricketMAN2 (@ImTanujSingh) July 23, 2023
171(387).
57(74).
38(30).
3 Innings, 266 runs, 88.68 average, 1 Hundred, 1 fifty - Leading runs scorer in this series. Incredible, Yashasvi. pic.twitter.com/DeEej1b5UuYashasvi Jaiswal in his Debut Test series for India:
— CricketMAN2 (@ImTanujSingh) July 23, 2023
171(387).
57(74).
38(30).
3 Innings, 266 runs, 88.68 average, 1 Hundred, 1 fifty - Leading runs scorer in this series. Incredible, Yashasvi. pic.twitter.com/DeEej1b5Uu
రచిన్ రవీంద్ర: న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే ఈ రెండేళ్లలో రచిన్‌కు పెద్దగా కలిసిరాలేదు. కానీ, ఆ ఏడాది జరిగిన 2023 వరల్డ్‌కప్‌లో మాత్రం రచిన్ అదరగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఏకంగా 64.22 స్టైక్ రేట్లతో 578 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. తాజాగా 2024 ఐపీఎల్ వేలంలో కూడా రచిన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది.
-
Rachin Ravindra in 2023 World cup
— Aryan (@aryan_14_) November 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Matches - 10
Innings - 10
Runs - 578
Avg - 64.22
Sr - 106.44
100s - 3
50s - 2
Hs - 123*
Wickets - 5
What a campaign it was for this 23 year old youngster. Chin up young man. U have a bright future pic.twitter.com/wpVjnE0CDl
">Rachin Ravindra in 2023 World cup
— Aryan (@aryan_14_) November 15, 2023
Matches - 10
Innings - 10
Runs - 578
Avg - 64.22
Sr - 106.44
100s - 3
50s - 2
Hs - 123*
Wickets - 5
What a campaign it was for this 23 year old youngster. Chin up young man. U have a bright future pic.twitter.com/wpVjnE0CDlRachin Ravindra in 2023 World cup
— Aryan (@aryan_14_) November 15, 2023
Matches - 10
Innings - 10
Runs - 578
Avg - 64.22
Sr - 106.44
100s - 3
50s - 2
Hs - 123*
Wickets - 5
What a campaign it was for this 23 year old youngster. Chin up young man. U have a bright future pic.twitter.com/wpVjnE0CDl
టౌహిద్ హ్రిదోయ్: బంగ్లాదేశ్‌కు చెందిన 23 ఏళ్ల టౌహిద్ హ్రిదోయ్ ఈ ఏడాది వన్డే కెరీర్ ప్రారంభించాడు. తొలి మ్యాచ్‌లోనే 92 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 2023 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై 74 పరుగులతో రాణించాడు హ్రిదోయ్. కెరీర్లో ఇప్పటివరకు 27 వన్డే మ్యాచ్‌లు ఆడిన హ్రిదోయ్ 727 పరుగులు నమోదు చేశాడు.
బౌలర్లు కూడా
రవి బిష్ణోయ్: టీమ్ఇండియా యంగ్ స్పిన్నర్ గతేడాదే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కానీ, ఈ ఏడాది బిష్ణోయ్ కెరీర్లో తొలిసారి టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బిష్ణోయ్ పొట్టి ఫార్మాట్లో 21 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు పడగొట్టాడు.
గెరాల్డ్ కొట్జి: సౌతాఫ్రికా బౌలర్ గెరాల్డ్ కొట్జి 2023 కలిసొచ్చింది. 23 ఏళ్ల గెరాల్డ్ 8 వన్డే మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. 2023 వరల్డ్‌కప్‌లో సఫారీ జట్టు విజయాల్లో గెరాల్డ్ కీలక పాత్ర పోషించాడు. అతడి ప్రదర్శనకుగానూ 2024 ఐపీఎల్ వేలంలో ముంబయి ఇండియన్స్ రూ.5కోట్లకు కొనుగోలు చేసింది.
బిష్ణోయ్ కెరీర్ బెస్ట్ పొజిషన్ - తొలిసారి టాప్ ప్లేస్‌కు - టీ20 ర్యాంకింగ్స్ రిలీజ్
ఇలాంటి సపోర్ట్‌ను నేను కలలో కూడా ఊహించలేదు - ఆ క్యాచ్ నాకు ఎంతో స్పెషల్!