Best Fielder Award : సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో.. భారత్ తిరుగులేని ప్రదర్శనను కనబరుస్తోంది. ఒకవైపు బ్యాటర్లు అదరగొడుతుంటే.. మరోవైపు బౌలర్లు విజృంభిస్తున్నారు. ఈ రెండిటిలోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ టీమ్ఇండియా ఆటగాళ్లు రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్నాడు.
రాహుల్ చేతుల మీదుగా.. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్.. మైదానంలో చురుగ్గా స్పందించాడు. మొదట బ్యాట్‌తో (82 పరుగులు) అదరగొట్టిన అతడు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌లోనూ తన మార్క్ చూపించాడు. గ్రౌండ్లో చురుగ్గా కదులుతూ.. సింగిల్స్ కూడా తీయనీయకుండా, బంతిని బౌండరీ వెళ్లకుండా అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలు చూపాడు. దీంతో టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్ టీ.దిలీప్.. శ్రేయస్ అయ్యర్‌ను 'ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికచేశాడు. ఈ అవార్డు విజేతను సచిన్ తెందూల్కర్ ప్రకటించాడు. టీమ్ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్.. అయ్యర్‌కు మెడల్‌ను అందించాడు.
సచిన్ నోట శ్రేయస్ పేరు.. శ్రేయస్‌కు అందించే బెస్ట్ ఫీల్డర్ అవార్డును స్వయంగా క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ నోటితో చెప్పించాడు ఫీల్డింగ్ కోచ్ దిలీప్. డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఏర్పాటు చేసిన ఎల్ఈడీ టీవీలో సచిన్ మాట్లాడిన వీడియోను ప్లే చేశారు. ఈ వీడియోలో.. 'నిన్న ఆడిన మ్యాచ్‌లో చాలా అద్భుతంగా ఆడారు. అంతకుముందు రోహిత్ నాతో బెస్ట్ ఫీల్డర్ మెడల్ గురించి మాట్లాడాడు. ఆ సమయంలో నేను 2003 లో జరిగిన ప్రపంచకప్ గురించి గుర్తుచేసుకున్నాను. సరిగ్గా 20 ఏళ్ల క్రితం మేము దక్షిణాఫ్రికాలో ఆడుతున్నాము. అక్కడ ఒక చార్ట్ ఉండేది. ఈ చార్ట్‌లో 'ఐ క్యాన్.. వి క్యాన్'(I Can, We Can) అని రాసి ఉండేది. దానిపై ప్రతిఒక్క ఆటగాడు సంతకం చేసే మైదానంలోకి దిగాలి. ఇదంతా ఆటగాడి కమిట్మెంట్ను సూచిస్తుంది. దీని అర్థం నేను 100 శాతం నా దేశం కోసం, నా టీమ్ కోసం ఆడుతున్నాను అని చెబుతుంది. ప్రస్తుతం ఉన్న టీమ్ఇండియా ఇదే పని చేస్తుంది. ఇప్పటివరకు మీరు ఆడిన ప్రతి మ్యాచ్‌ను నేను ఎంజాయ్ చేశాను. చాలా అద్భుతం. ఈ ఫామ్‌ను ఇలానే కొనసాగించండి. ఆల్ ది బెస్ట్' అంటూ అక్కడే ఉన్న ఆటగాళ్లను అభినందించాడు సచిన్. ఇక చివరగా 'బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డ్‌ను శ్రేయస్ అయ్యర్ గెలుచుకున్నట్లుగా ప్రకటించాడు సచిన్.
-
The Medal Ceremony 🏅 in the dressing room just attained "LEGENDARY" status 🙌🏻#TeamIndia was in for a surprise when someone 𝗜𝗡𝗦𝗣𝗜𝗥𝗔𝗧𝗜𝗢𝗡𝗔𝗟 announced the best fielder award 🫡🔝#CWC23 | #MenInBlue | #INDvSL
— BCCI (@BCCI) November 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
WATCH 🎥🔽 - By @28anand
">The Medal Ceremony 🏅 in the dressing room just attained "LEGENDARY" status 🙌🏻#TeamIndia was in for a surprise when someone 𝗜𝗡𝗦𝗣𝗜𝗥𝗔𝗧𝗜𝗢𝗡𝗔𝗟 announced the best fielder award 🫡🔝#CWC23 | #MenInBlue | #INDvSL
— BCCI (@BCCI) November 3, 2023
WATCH 🎥🔽 - By @28anandThe Medal Ceremony 🏅 in the dressing room just attained "LEGENDARY" status 🙌🏻#TeamIndia was in for a surprise when someone 𝗜𝗡𝗦𝗣𝗜𝗥𝗔𝗧𝗜𝗢𝗡𝗔𝗟 announced the best fielder award 🫡🔝#CWC23 | #MenInBlue | #INDvSL
— BCCI (@BCCI) November 3, 2023
WATCH 🎥🔽 - By @28anand
వరుస విజయాలతో భారత్ కొత్త రికార్డు - అప్పుడు 8, ఇప్పుడు 7!
హిట్‌మ్యాన్ వరల్డ్ కప్ రికార్డుపై ఆ స్టార్ ప్లేయర్ ఫోకస్ - కొడితే తొలి బ్యాటర్‌గా!