ETV Bharat / sports

అత్యుత్తమ ఆసియా టీ20 ఎలెవన్ ఇదే!

టీ20 ఫార్మాట్​లో తనదైన ముద్ర వేస్తున్నాయి ఆసియా దేశాలు. మొత్తం ఆరు సార్లు పొట్టి ప్రపంచకప్​ జరగ్గా అందులో సగం సార్లు ఆసియా దేశాలే కప్​ను గెలుచుకున్నాయి. ఈ తరుణంలో అత్యుత్తమ ఆసియా దేశాల క్రికెటర్లతో ఓ టీమ్​ను తయారు చేస్తే అందులో ఎవరెవరికీ స్థానం దక్కుతుందనేది ఓ సారి చూద్దామా..

asia eleven team, t20 wc
ఆసియా ఎలెవన్ టీమ్, టీ20 ప్రపంచకప్
author img

By

Published : Jun 9, 2021, 9:32 AM IST

టీ20 ప్రపంచకప్​నకు మరో నాలుగు నెలల సమయం ఉంది. 2007లో పొట్టి వరల్డ్​కప్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఆరు సీజన్లు ముగిశాయి. ఇందులో ఆసియా దేశాలు మూడు సార్లు కప్​ను కైవసం చేసుకున్నాయి. ప్రపంచ క్రికెట్​లో ఆసియా దేశాలు గట్టి ప్రభావం చూపుతున్నాయన్నడానికి ఇదో ఉదాహరణ. అఫ్గానిస్థాన్​ వంటి దేశాలు ఎమర్జింగ్ టీమ్​గా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా జట్ల నుంచి ఓ టీ20 జట్టును తయారు చేస్తే.. అందులో ఎవరెవరికీ చోటు దక్కుతుంది. ఏయే ఆటగాడు ఏ స్థానంలో సరిగా సరిపోతాడనేది ఓ సారి చూద్దామా..

1. రోహిత్​ శర్మ(కెప్టెన్​)..

పొట్టి ఫార్మాట్​ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రోహిత్​ శర్మ అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్​ తుది జట్టులో స్థానం సంపాదించిన రోహిత్​.. కప్​ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్లో 30 పరుగులు చేశాడు. టీ20ల్లో మార్టిన్ గప్తిల్​ తర్వాత అత్యధిక సిక్స్​లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు రోహిత్. 2017 పొట్టి ప్రపంచకప్​లో వేగవంతమైన సెంచరీ భాగస్వామ్యంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఒకసారి క్రీజులో కుదురుకున్నాడంటే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఐపీఎల్​లో సారథిగా అత్యుత్తమంగా రాణిస్తున్న రోహిత్​ను.. ఈ ఆసియా బెస్ట్​ ఎలెవన్​ జట్టుకు నాయకుడిగా ఎంపిక చేయవచ్చు.

2. బాబర్ అజామ్..

ఈ ఆసియా ఎలెవన్​ జట్టులో కచ్చితంగా ఉండాల్సిన పేరు బాబర్ అజామ్. తన ఆటతీరుతో అంతగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. రోహిత్​కు సరైన జోడీగా అతడిని తుది జట్టులో తీసుకోవచ్చు. ప్రపంచంలో అత్యుత్తమ టీ20 బ్యాట్స్​మెన్లలో బాబర్ ఒకడు. సుదీర్ఘ కాలం ఈ ఫార్మాట్​లో అగ్రస్థానంలో నిలిచిన అజామ్​ను.. ఇంగ్లాండ్ బ్యాట్స్​మన్​ డేవిడ్ మలన్ అధిగమించాడు. పేస్​తో పాటు స్పిన్​ను సమర్థంగా ఎదుర్కొనే బాబర్.. ఆసియా ఎలెవన్​ జట్టులో ఉండటానికి అర్హుడు.

3. విరాట్ కోహ్లీ..

క్రికెట్​లోని మూడు ఫార్మాట్లలో ప్రపంచ స్థాయి ఆటగాడైనా విరాట్​. వన్​డౌన్​లో సరిగా అతికినట్టు సరిపోతాడు. టీ20 క్రికెట్ తొలినాళ్లలో ఫార్మాట్​కు తగ్గట్టు ఆడని కోహ్లీ.. తర్వాతి రోజుల్లో తన ఆటతీరును మార్చుకున్నాడు. ఏ టీమ్​పై అయినా సత్తా చాటేలా తన బ్యాటింగ్​ను మెరుగుపరుచుకున్నాడు. మిడిలార్డర్​ బ్యాట్స్​మన్​గా జట్టుకు నిలకడగా పరుగులు సాధించి పెట్టడంలో విజయవంతమయ్యాడు కోహ్లీ. ఛేజింగ్​లో అయితే అతని ఇన్నింగ్స్​లకు లెక్కే లేదు.

4. మహమ్మద్​ రిజ్వాన్​(వికెట్ కీపర్)..

పాకిస్థాన్ జట్టులో రెండేళ్లుగా ఎక్కువగా వినపడుతున్న పేరు రిజ్వాన్​. తనదైన బ్యాటింగ్​తో జట్టుకు పలు విజయాలు అందించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్​లో పొట్టి ఫార్మాట్​లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. జింబాబ్వేపై అత్యుత్తమంగా రాణించిన రిజ్వాన్​ టీ20 ర్యాకింగ్స్​లో పదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అటు కీపింగ్​లోనూ నిలకడగా రాణిస్తున్న రిజ్వాన్​కు.. ఆసియా ఎలెవన్​ తుది జట్టులో చోటు దక్కడం ఖాయం.

5. షకిబుల్ హసన్..

బంగ్లాదేశ్ జట్టులోని అత్యంత అనుభవజ్ఞుడైన ఆల్​రౌండర్​ షకిబుల్ హసన్​. బంతితోనూ, బ్యాట్​తోనూ రాణించగల సమర్థుడు. కఠిన పరిస్థితుల నుంచి జట్టును సురక్షిత స్థానానికి తీసుకెళ్లగల క్రికెటర్. మిడిలార్డర్​లో ఉపయుక్తమైన బ్యాట్స్​మన్​. అవసరమైనప్పుడల్లా టీమ్​కు వికెట్లు అందించడం హసన్​ సొంతం. 2019 ప్రపంచకప్​లో స్థిరంగా రాణించాడు షకిబుల్. ఆల్​రౌండర్​గా, అనుభవజ్ఞుడిగా.. ఆసియా ఎలెవన్​ జట్టులో స్థానం పొందాల్సిన సరైన ఆటగాడు హసన్.

ఇదీ చదవండి: WTC Final: ఔట్​డోర్ ప్రాక్టీస్​లో టీమ్ఇండియా

6. హర్దిక్ పాండ్యా..

హార్డ్ హిట్టింగ్​తో పాటు తెలివైన బౌలింగ్​తో ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను ముప్పుతిప్పలు పెట్టే క్రికెటర్​ హర్దిక్ పాండ్యా. ఇటీవల వెన్ను నొప్పి కారణంగా బౌలింగ్​కు దూరమైన పాండ్యా.. తనదైన రోజున మళ్లీ బంతితోనూ రాణించగలడు. స్లాగ్​ ఓవర్లలో జట్టుకు అవసరమైన పరుగులు సాధించగల సత్తా హర్దిక సొంతం. లోయర్​ ఆర్డర్​లో జట్టుకు అత్యంత ముఖ్యమైన ఆటగాడు. ఇక ఫీల్డింగ్​లోనూ పాండ్యా తనదైన మార్కును చూపిస్తాడు. జట్టుకు ఎక్స్​ ఫ్యాక్టర్ ఆటగాడిగానూ ఉపయోగపడతాడు. టీమ్​లో అతనికి ఆరో స్థానం సరిగా సరిపోతుంది.

7. మహమ్మద్ నబీ..

2019 ప్రపంచకప్​ గ్రూప్​ దశ మ్యాచ్​ల్లో రాణించాడు అఫ్గానిస్థాన్​ ఆల్​రౌండర్​ మహమ్మద్ నబీ. టాంటన్​ వేదికగా కౌంటీ గ్రౌండ్​లో కివీస్​తో జరిగిన మ్యాచ్​లో విధ్వంసం సృష్టించాడు. బంతితోనూ బ్యాట్​తోనూ రాణించగల నబీ.. అఫ్గాన్ జట్టులో కీలక ఆటగాడు. 2019 ప్రపంచకప్​లో భారత్​పైనా చేలరేగి ఆడాడు. ప్రపంచంలోని వివిధ లీగ్​ల్లో వివిధ ఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఐసీసీ ప్రకటించిన ఐసీసీ ఆల్​రౌండర్ల జాబితాలో నబీ అగ్రస్థానంలో ఉన్నాడు.

8. సందీప్ లమిచానే​..

ఐపీఎల్​లో స్థానం సంపాదించిన ఏకైక నేపాల్ ఆటగాడు సందీప్ లమిచానే. అతడిని దిల్లీ క్యాపిటల్స్​ కొనుగోలు చేసింది. తనదైన శైలిలో వికెట్లు తీయగల బౌలర్​. ఐపీఎల్​లో స్థానం పొందిన తర్వాత అతని ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. బిగ్​బాష్ లీగ్​లోనూ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు సందీప్​.

9. రషీద్ ఖాన్..

అఫ్గానిస్థాన్ జట్టులో అత్యంత అనుభవజ్ఞుడు, జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించే​ స్పిన్నర్​ రషీద్​ ఖాన్​. నబీతో పాటు రషీద్​.. జట్టు విజయంలో తమదైన ముద్ర వేస్తున్నారు. 2018 ఐపీఎల్​లో రషీద్ ప్రదర్శనను అంత తొందరగా ఎవరూ మర్చిపోలేరు. చాలా మంది క్రికెటర్లు రషీద్ బౌలింగ్​లో డిఫెన్స్​కు ప్రయత్నిస్తుంటారు. అతడు వేసే ప్రతి బంతి కొత్తగానే ఉంటుంది. ప్రపంచంలోని అత్యుత్తమ మణికట్టు స్పిన్నర్లలో రషీద్ ఒకడు.

10. జస్ప్రీత్ బుమ్రా..

డెత్​ ఓవర్లలో బౌలింగ్ చేయగల సమర్థుడు బుమ్రా. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా కూడా ఒకడు. అతడు యార్కర్లు వేశాడంటే బంతిని ఆపడమే కష్టం. ఇక అతని బౌలింగ్​లో బౌండరీలు కొట్టాలంటే ఇబ్బందనే చెప్పాలి. టెస్టు క్రికెట్​లోకి అరంగేట్రం చేశాక మరికొన్ని అస్త్రాలను తన అమ్ములపొదిలో దాచుకున్నాడు బుమ్రా. డెత్​ ఓవర్లలో అతడి బౌలింగ్​ను ఎదుర్కోవాలంటే బ్యాట్స్​మెన్​ ఇబ్బంది పడాల్సిందే.

11. షాహిన్ ఆఫ్రిది..

న్యూజిలాండ్​ వేదికగా జరిగిన అండర్​-19 ప్రపంచకప్​లో తన మార్క్​ను చూపించాడు షాహిన్​. అతని బౌలింగ్​ చూసి దక్షిణాఫ్రికా గ్రేట్​ గ్రేమ్ స్మిత్​.. అతనిని అభినందించాడు. కొత్త బంతితో రాణించగల షాహిన్​.. డెత్​ ఓవర్లలో బుమ్రాకు సరైన జోడీ అవుతాడనడంలో సందేహమే లేదు. ప్రస్తుతం ర్యాంకింగ్స్​లో 11వ స్థానంలో ఉన్నాడీ పాకిస్థాన్ బౌలర్​.

ఇదీ చదవండి: WTC Final: ప్రాంతీయ భాషల్లోనూ మ్యాచ్ ప్రసారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.