Black Marketing Of World Cup Tickets : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు- బీసీసీఐకి బంగాల్ పోలీసులు నోటీసులు పంపారు. కోల్‌కతాలోని ఈడెన్ మైదానంలో ఆదివారం జరగనున్న భారత్-దక్షిణాఫ్రికా ప్రపంచకప్ మ్యాచ్‌కు సంబంధించి ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో చెప్పాలని నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించిన పత్రాలను శనివారం సాయంత్రం బీసీసీఐ ప్రెసిడెంట్ అందుకున్నారు. బోర్డుకి చెందిన సంబంధిత అధికారి నవంబర్ 5న కోలకతాలో భారత్-సౌతాఫ్రికా మధ్య జరగబోయే మ్యాచ్ కోసం బీసీసీఐ ఎన్ని టికెట్లను విక్రయించింది అనే పూర్తి వివరాలను మైదాన్ పోలీస్ స్టేషన్లో సమర్పించాలని బంగాల్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
బ్లాక్‌లో టికెట్స్ సేల్..
World Cup Black Tickets : అయితే భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను కొందరు దళారులు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని బంగాల్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ నోటీసులు అందుకున్నారు. మరోవైపు ఈ కేసుతో సంబంధమున్న 19 మందిని బంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 108 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌కు సంబంధించి ఇప్పటివరకు ఏడు కేసులు నమోదు చేశారు.
-
Last evening, a notice was sent to President BCCI to provide relevant documents/information regarding the sale of tickets by them or any competent person of his organisation to the IO of Maidan PS: Kolkata Police
— ANI (@ANI) November 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Last evening, a notice was sent to President BCCI to provide relevant documents/information regarding the sale of tickets by them or any competent person of his organisation to the IO of Maidan PS: Kolkata Police
— ANI (@ANI) November 5, 2023Last evening, a notice was sent to President BCCI to provide relevant documents/information regarding the sale of tickets by them or any competent person of his organisation to the IO of Maidan PS: Kolkata Police
— ANI (@ANI) November 5, 2023
"అక్టోబర్ 31 మంగళవారం నేను విధుల్లో ఉండగా నాకు కొన్ని ఫిర్యాదులు అందాయి. అందులో నవంబర్ 5న జరిగే భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఉంది. కొందరు దళారులు వాటిని బ్లాక్‌లో అమ్ముతున్నారని తెలిసింది. ఈ కారణంతోనే బీసీసీఐకి నోటీసులు జారీ చేశాము. సంబంధిత అధికారి.. టికెట్స్ అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలతో మైదాన్ పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని కోరాము."
- మైదాన్ పీఎస్ అధికారి
విరాట్‌కు బర్త్‌డే స్పెషల్ గిఫ్ట్..
CWC 2023 Virat Kohli Birthday Gift : ఆదివారం ఈడెన్ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ పోరులో భారత్-దక్షిణాఫ్రికాలు తలపడనున్నాయి. అయితే ఆదివారం కింగ్ విరాట్ పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఈ సందర్భంగా కోహ్లీకి ఓ స్పెషల్ మోమెంటోను అందించనున్నట్లు తెలిపారు బంగాల్ క్రికెట్ అసోసియేషన్(సీఏబీ) అధ్యక్షుడు స్నేహాషిశ్ గంగూలీ. అలాగే విరాట్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్‌ను కూడా కట్ చేయించనున్నారు. మ్యాచ్ అనంతరం బాణసంచా, లైట్, సౌండ్ షోలు కూడా ఉంటాయని సీఏబీ ప్రెసిడెంట్ చెప్పారు.
వరల్డ్ కప్ 2023 - 'హార్దిక్ ప్లేస్‌లో ప్రసిద్ధ్‌ను అందుకే తీసుకున్నాం'
7అడుగుల ఎత్తు, 5టన్నుల ఇసుక- విరాట్ కోహ్లీ సైకత శిల్పం అదుర్స్!
సెంచరీల రారాజు - విరాట్ కోహ్లీ స్పెషల్ రికార్డుల గురించి మీకు తెలుసా ?