ETV Bharat / sports

వరల్డ్ కప్ హీరో రిటైర్మెంట్ వెనక్కి.. ఇంగ్లాండ్ వన్డే జట్టుకు ఎంపికైన బెన్ స్టోక్స్ - బెన్ స్టోక్స్ ఓడీఐ

Ben Stokes World Cup 2023 : ఇంగ్లాండ్ వన్డే జట్టులోకి స్టార్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్ తిరిగి వచ్చేశాడు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. భారత్​లో జరగనున్న వన్డే ప్రపంచకప్​లో అతడి సేవలు కీలకంగా మారతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Ben Stokes World Cup 2023
Ben Stokes World Cup 2023
author img

By

Published : Aug 16, 2023, 4:56 PM IST

Ben Stokes World Cup 2023 : వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్ తిరిగి 50ఓవర్ల ఫార్మాట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. రిటైర్మెంట్​ను వెనక్కి తీసుకున్న ( Ben Stokes ODI Return ) అతడు.. మళ్లీ ఇంగ్లాండ్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ముందుగా అతడు న్యూజిలాండ్​తో జరిగే నాలుగు వన్డేల సిరీస్​లో ఆడనున్నాడు. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించిన జట్టులో స్టోక్స్​కు స్థానం లభించింది. దీన్ని బట్టి చూస్తే అతడు భారత్​లో జరగనున్న వన్డే ప్రపంచకప్​ ఆడటం ఖాయంగానే కనిపిస్తోంది.

Ben Stokes ODI Retirement Back : బెన్ స్టోక్స్ గతేడాది వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. నిలకడగా మూడు ఫార్మాట్లు ఆడటం కష్టమని పేర్కొంటూ వన్డేల​కు దూరమయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు సారథిగా ఉన్నాడు. గతేడాది ఇంగ్లాండ్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్​లోనూ స్టోక్స్.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ తొలి వన్డే వరల్డ్ కప్ గెలవడానికి కృషి చేశాడు. ఈ నేపథ్యంలోనే వచ్చే ప్రపంచకప్​కు అతడిని తిరిగి తీసుకొచ్చేందుకు ఈసీబీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అక్టోబర్​లో జరిగే వన్డే ప్రపంచకప్​లో అతడి సేవలు ఇంగ్లాండ్​కు కీలకంగా మారుతాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

  • The big man is back 🔥

    Luke Wright on the sensational return of Ben Stokes to ODI cricket... 👇

    — England Cricket (@englandcricket) August 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"బెన్ స్టోక్స్ నాయకత్వ పటిమ, మ్యాచ్​లను గెలిపించే సత్తా.. ఇంగ్లాండ్ జట్టుకు ఉపయోగపడుతుంది. బెన్ స్టోక్స్ ఆటను ప్రతి ఫ్యాన్ ఎంజాయ్ చేస్తారు. ఇంగ్లాండ్ వన్డే జట్టులో అతడిని చూడటం చాలా మందికి సంతోషం కలిగిస్తుంది."
-ల్యూక్ రైట్, ఇంగ్లాండ్ జాతీయ సెలెక్టర్

భారత్​లో జరిగే ప్రపంచకప్​లో ఇంగ్లాండ్.. డిఫెండింగ్ ఛాంపియన్​గా బరిలోకి దిగనుంది. గత ప్రపంచకప్​ ఫైనల్లో న్యూజిలాండ్​పై అనూహ్య విజయం సాధించి ఇంగ్లాండ్ తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచింది. సూపర్ ఓవర్​లోనూ మ్యాచ్ టై కావడం వల్ల.. బౌండరీ కౌంట్ (ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టు) ద్వారా ఇంగ్లాండ్​ను విజేతగా నిర్ణయించారు. అయితే, ఫైనల్​లో స్టోక్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టెస్టుల్లో దూకుడైన ఆటతీరుతో ఇంగ్లాండ్​ను నడిపిస్తున్నాడు. దీంతో ఈసారి స్టోక్స్ సేవలు కీలకంగా మారతాయని ఇంగ్లాండ్ భావిస్తోంది.

World Cup Trophy Tour : తాజ్​మహల్​ ముందు ప్రపంచకప్​ ట్రోఫీ.. ఫ్యాన్స్​ సందడే సందడి

Rishabh Pant Batting : పంత్ మైదానంలోకి అడుగుపెట్టేశాడోచ్​.. బ్యాటింగ్ వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.