ETV Bharat / sports

Ben Stokes VS New Zealand : 15 ఫోర్లు, 9 సిక్స్‌లతో బెన్​ స్టోక్స్ ఊచకోత.. డబుల్​ సెంచరీ జస్ట్ మిస్​! - బెన్స్​ స్టోక్స్ రికార్డ్ ఇన్నింగ్స్​

Ben Stokes VS New Zealand : రీసెంట్​గా వన్డే రిటైర్మెంట్‌పై యూటర్న్‌ తీసుకున్న ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌.. తాజాగా సంచలన ప్రదర్శన చేశాడు.

Ben Stokes VS New Zealand : 15 ఫోర్లు, 9 సిక్స్‌లతో బెన్​ స్టోక్స్ ఊచకోత.. డబుల్​ సెంచరీ జస్ట్ మిస్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 10:45 PM IST

Ben Stokes VS New Zealand : ఇటీవల వన్డే రిటైర్మెంట్‌పై యూటర్న్‌ తీసుకున్న ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌.. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌ ముంగిట అదిరిపోయే ప్రదర్శన చేశాడు. రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకున్న తర్వాత ఆడిన తొలి వన్డేలో.. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

New Zealand VS England : న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడో వన్డే ఆడిన బెన్‌స్టోక్స్‌ 124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో 182 పరుగులు చేశాడు. కివీస్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. బౌండరీలు బాదేస్తూ న్యూజిలాండ్‌ బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్​గా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు జేసన్‌రాయ్‌ (180) పేరిట ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని స్టోక్స్ అధిగమించాడు.

డబుల్ సెంచరీ జస్ట్ మిస్​.. డబుల్ సెంచరీ దిశగా సాగుతున్న స్టోక్స్‌ను 45 ఓవర్‌లో బెన్‌ లిస్టర్‌ ఔట్ చేశాడు. దీంతో స్టోక్స్ ఇన్నింగ్స్​కు తెర పడింది. ఇక ఈ మ్యాచ్​లో బెన్‌స్టోక్స్‌ ధనాధన్ ఇన్నింగ్స్​కు డేవిడ్ మలన్ (96; 95 బంతుల్లో) ఇన్నింగ్స్​ తోడు కావడంతో ఇంగ్లాండ్ జట్టు.. 48.1 ఓవర్లలో 368 పరుగులకు ఆలౌట్ అయింది. స్టోక్స్‌ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆ సమయానికి ఇంగ్లాండ్ 348 పరుగులు చేసింది. ఇక స్టోక్స్ ఔట్​ అవ్వగానే.. ఇంగ్లాండ్​ వరుసగా వికెట్లు కోల్పోయింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ (5/51) మెరవగా.. బెన్‌ లిస్టర్ 3, ఫెర్గూసన్, గ్లెన్‌ ఫిలిప్స్‌ ఒక్కో వికెట్ తీశారు. ఈ స్కోర్​తో ఇంగ్లాండ్ జట్టు ఓ రికార్డును అందుకుంది. ​ పురుషుల వన్డే క్రికెట్‌లో ఆల్ ఔట్ అయి అత్యధిక స్కోరు (368) చేసిన రెండో జట్టుగా నిలిచింది. 2019లో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్‌ 389 పరుగులకు ఆలౌట్ అయింది.

  • How good was that?

    The highest individual ODI score for England.

    Enjoy every second of him.

    We are so lucky to be witnessing this 🙏 pic.twitter.com/ZfeFdwRmc0

    — England Cricket (@englandcricket) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Asia Cup 2023 IND VS PAK : అదే జరిగితే మూడోసారి భారత్-పాక్ మ్యాచ్ కన్ఫార్మ్! సమీకరణాలు ఎలా ఉన్నాయంటే?

Kohli 300 Victories : కోహ్లీ ఖాతాలో మరో అత్యంత అరుదైన రికార్డ్​.. ఈ సారి ఏకంగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.