Ben Stokes on Joe Root captaincy: కెప్టెన్‌గా వ్యవహరించాలన్న ఆశ తనకు అస్సలు లేదని అన్నాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. జో రూట్ సారథ్యంలో తాను ఆటను కొనసాగిస్తానని చెప్పాడు. రూట్, కోచ్ సిల్వర్‌వుడ్.. ఆటలో తనను ఎంతగానో ప్రోత్సాహించారని పేర్కొన్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐదు మ్యాచ్‌లో యాషెస్ సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆసీస్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో.. ఓటమికి జో రూట్, కోచ్ సిల్వర్‌వుడ్ బాధ్యత వహించాలి, రూట్ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. బెన్‌స్టోక్స్‌ను సారథిగా నియమించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన స్టోక్స్.. కెప్టెన్సీపై తనకు అస్సలు ఆశ లేదని చెప్పాడు.
"కెప్టెన్సీ అంటే చాలా అంశాలు పరిగణలోకి వస్తాయి. ఫీల్డింగ్ సెట్ చేయడం, జట్టును ఎంచుకోవడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం ఇంకా చాలా ఉంటాయి. ఓ ప్లేయర్ కూడా మైదానంలోకి వెళ్లి కెప్టెన్ కోసం ఆడాలనుకోవాలి. రూట్ అలాంటి సారథే. నేను ఎప్పుడూ అతడి కోసం ఆడాలనుకుంటాను." స్టోక్స్ పేర్కొన్నాడు.
కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌కు కూడా మద్దతుగా నిలిచాడు స్టోక్స్. "డ్రెసింగ్ రూమ్‌లో క్రిస్, రూట్ ఆటగాళ్ల అభిప్రాయాలు, ఆలోచనలను అడిగి తెలుసుకుంటారు. క్రిస్.. రియల్ ప్లేయర్స్ కోచ్. ఆటగాళ్లకు అతడు అండగా నిలుస్తాడు." అని స్టోక్స్ అన్నాడు.
ఇదీ చూడండి: 'యాషెస్‌లో తప్పిదాలు.. రూట్ కెప్టెన్‌గా తప్పుకోవాలి'