ETV Bharat / sports

ధోనీ కంటే ముందే హెలికాప్టర్ షాట్​ ఆడింది అతడే!

author img

By

Published : May 16, 2021, 11:51 AM IST

బ్యాట్స్​మన్లు తమదైన శైలిలో కొట్టే షాట్లను బట్టి కొన్నింటికి ఆ క్రికెటర్ల పేర్లు స్థిరపడతాయి. అలా వచ్చినవే దిల్​ స్కూప్​, మహి హెలికాప్టర్​ షాట్​, ఏబీ 360 డిగ్రీస్​ షాట్. వీటిలో క్రికెట్ అభిమానులకు ఎక్కువగా గుర్తుండిపోయే స్టైల్​ హెలికాప్టర్ షాట్. దీనిని ధోనీ కంటే ముందే మరో క్రికెటర్​ ఆడి చూపించాడు. అతడెవరో తెలుసుకోవాలంటే చదవండి మరి.

ms dhoni, mohammed azaruddin
మహేంద్ర సింగ్ ధోనీ, మహమ్మద్ అజారుద్దీన్

క్రికెట్​లో ఫుల్ లెంగ్త్​ ​బాల్​, యార్కర్​ను ఎదుర్కోవాలంటే బ్యాట్స్​మన్​కు ఒకింత కష్టమే. ఆ బంతిని డిఫెన్స్ చేస్తేనే గొప్ప.. అలాంటిది బ్యాట్స్​మన్​ తమదైన శైలిలో బంతిని బౌండరీకి తరలిస్తే. వావ్​ అంటూ నోరు వెళ్లబెట్టాల్సిందే. ఆ కోవకు చెందినదే ధోనీ హెలికాప్టర్ షాట్. అయితే దీనిని మహి కంటే ముందే మరో ఆటగాడు ఆడి చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది.

భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్​ ఈ హెలికాప్టర్​ షాట్​ను గతంలోనే ఆడాడు. 1996లో కోల్​కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్​ మ్యాచ్​లో అజారుద్దీన్​ కేవలం 77 బంతుల్లోనే 109 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, ఒక సిక్స్​ ఉన్నాయి. సౌతాఫ్రికా ఆల్​రౌండర్ క్లూసెనర్​ వేసిన ఓ ఓవర్లో అజారుద్దీన్​ ఏకంగా 5 ఫోర్లు బాదాడు. తొలి రెండు బంతులకు బౌండరీలు కొట్టడం వల్ల తదుపరి బంతిని యార్కర్​గా వేశాడు ప్రోటీస్ బౌలర్. ఆ బంతిని హెలికాప్టర్​ షాట్​ ఆడాడు అజారుద్దీన్​.

ఇదీ చదవండి: కొవిడ్​ బాధితులకు అండగా 'సెహ్వాగ్​ ఫౌండేషన్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.