ETV Bharat / sports

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​కు బీసీసీఐ ప్రణాళిక

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ మ్యాచ్​ నిర్వహణకు బీసీసీఐ ప్రణాళిక రచించింది. కోహ్లీసేన.. భారత్​లో 8 రోజులపాటు బయోబబుల్​లో ఉంటుందని, ఇంగ్లాండ్​లో 10 రోజుల పాటు క్వారంటైన్​లో ఉండనుందని తెలిపింది.

BCCI plan for WTC
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్, టీమ్​ఇండియా
author img

By

Published : May 8, 2021, 1:46 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్లో న్యూజిలాండ్​తో తలపడేందుకు సిద్ధమవుతోంది కోహ్లీసేన. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ.

జూన్​ 18న జరగనున్న ఫైనల్ మ్యాచ్​ నేపథ్యంలో.. భారత జట్టు మే 25 నుంచి 8 రోజుల పాటు బయో బబుల్​లో ఉండనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ బబుల్​ను భారత్​లోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తర్వాత 10 రోజుల పాటు ఇంగ్లాండ్​లో.. ఆటగాళ్లను క్వారంటైన్​లో ఉంచనున్నట్లు స్పష్టం చేసింది. జూన్​ 2న భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ చేరుకోనున్నట్లు తెలిపింది.

ప్రపంచ టెస్టు ఛాంపియ్​షిప్ ఫైనల్​తో పాటు ఇంగ్లాండ్​తో జరిగే ఐదు మ్యాచ్​లో టెస్టు సిరీస్​కు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి:కెరీర్‌పై భయంతో పుజారా ఏడ్చిన వేళ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.