అక్టోబర్ 17 నుంచి(t20 world cup 2021 schedule) యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. పరిస్థితి అనుకూలించి ఉంటే ఈ టోర్నీ భారత్‌లో జరగాల్సింది. ప్రస్తుతం ఈ మెగాటోర్నీకి యూఏఈ ఆతిథ్యమిచ్చినప్పటికీ బీసీసీఐ ఆధ్వర్యంలోనే జరగబోతుంది. ఇదిలా ఉండగానే భవిష్యత్‌లో నిర్వహించబోయే మరిన్ని ఐసీసీ టోర్నీలను హోస్ట్ చేసేందుకు ఇప్పటినుంచే ప్రణాళిక రచిస్తోంది బీసీసీఐ. ఈ విషయాన్ని బోర్డుకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. వచ్చే ఎనిమిదేళ్లకుగానూ(icc events calendar) మరో మూడు ఈవెంట్ల ఆతిథ్య హక్కులను పొందాలని బోర్డు భావిస్తోందని చెప్పారు.
"2023 ప్రపంచకప్ తర్వాత మరిన్ని ఐసీసీ ఈవెంట్ల ఆతిథ్య హక్కులను పొందాలని ప్రణాళిక రచిస్తున్నాం. ఒక్కసారి మా ప్రణాళిక పూర్తిగా సిద్ధమైతే, త్వరలోనే జరగబోయే ఐసీసీ మీటింగ్‌లో(bcci icc meeting) అధికారుల దృష్టికి ఈ ప్లాన్‌ను తీసుకెళ్తాం. ఆ మెగాటోర్నీలు ఇక్కడే జరుగుతాయని ఆశిస్తున్నాం. వచ్చే ఎనిమిదేళ్లకుగానూ మూడు ఐసీసీ ఈవెంట్లను ఇక్కడ నిర్వహించాలనేదే మా లక్ష్యం."
-బోర్డు ప్రతినిధి.
అక్టోబర్ 17 నుంచి నవంబరు 14వరకు టీ20 ప్రపంచకప్‌కు జరగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ జట్టుకు మెంటార్‌గా మాజీ సారథి ధోనీని నియమించారు.
టీమ్ఇండియా స్క్వాడ్:(t20 world cup 2021 indian team): విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
స్టాండ్‌బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్.
ఇదీ చూడండి: T20 World Cup: గుడ్‌న్యూస్.. స్డేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి