టోక్యో ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) పాల్గొననున్న భారత అథ్లెట్లకు విరాళం ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఆటగాళ్ల శిక్షణతో పాటు సన్నద్ధత కోసం రూ.10 కోట్లను డొనేషన్‌గా ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఆదివారం జరిగిన బీసీసీఐ అపెక్స్ మండలి అత్యవసర సమావేశంలో.. బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా ఈ నిర్ణయం తీసుకున్నారు.
"ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లకు సాయం చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. రూ.10 కోట్లను మంజూరు చేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నారు. ఆటగాళ్ల సన్నద్ధతతో పాటు శిక్షణ కోసం ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది. క్రీడా మంత్రిత్వ శాఖ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో మాట్లాడిన తర్వాత చెల్లింపులు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం బీసీసీఐ విరాళాలు ఇవ్వడం ఇదేం కొత్త కాదు. భారత క్రికెట్ బోర్డు.. ఒలింపిక్స్‌ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్ జులై 23 నుంచి ఆగస్ట్ 8 వరకు జరగనున్నాయి.
ఇదీ చదవండి: Yoga Day: దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా యోగా సెంటర్లు