ETV Bharat / sports

బీసీసీఐ యూటర్న్​.. వరల్డ్​కప్​నకు ముందు 2సార్లు భారత్ ​x పాక్​​ ఢీ!

author img

By

Published : Jun 24, 2023, 2:31 PM IST

Asia Games 2023 Cricket : భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆసియా కప్​నకు భారత జట్లను పంపించే విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. చైనా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్​ 2023కు టీమ్ఇండియా పురుషులు, మహిళల జట్లను పంపించేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం. అంతకుముందు ఆసియా గేమ్స్​కు తమ జట్లను పంపించబోమని బీసీీసీఐ చెప్పింది.

Asia Games 2023 Cricket
Asia Games 2023 Cricket

Asia Games 2023 Cricket : ఆసియా గేమ్స్​కు భారత జట్లను పంపించే విషయంలో భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. చైనా ఆతిథ్యం ఇస్తున్న ఆసియన్ గేమ్స్​ 2023కు భారత పురుషులు, మహిళల జట్లను పంపించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆంగ్ల మీడియా కథనాలు ప్రచురించింది. అయితే ఇంతకుముందు ఆసియా గేమ్స్​కు తమ జట్లను పంపించబోమని బీసీసీఐ తేల్చిచెప్పింది. క్రికెట్​ను ఇప్పటివరకు ఆసియన్​ గేమ్స్​లో 2010, 2014లో మాత్రమే భాగం చేశారు. ఇప్పుడు మరోసారి ఆ అవకాశం వచ్చింది. ఈ ఆసియా క్రీడల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్‌, శ్రీలంక లాంటి టీమ్​లు పాల్గొన్నప్పటికీ.. భారత్​ మాత్రం తమ జట్లను పంపించలేదు.

ICC World Cup 2023 : ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు, చైనాలోని హాంగ్‌జౌ వేదికగా ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఇందులో టీ20 ఫార్మాట్​లో క్రికెట్​ మ్యాచ్​లు జరుగుతాయి. ​అయితే ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్​నకు భారత్‌ ఆతిథ్యమిస్తోంది. దీంతో భారత పురుషుల జట్టు వెళ్లే అవకాశం లేదు. కాబట్టి ఆసియా క్రీడలకు పురుషుల ఇండియా-బీ జట్టును పంపించనుందని తెలుస్తోంది. ఇక మహిళల-ఏ జట్టు మాత్రం ఆసియా క్రీడల్లో తలపడనుంది. జూన్​ 30 లోపు టీమ్​ల వివరాలను ఒలంపిక్ అసోషియేషన్​కు బీసీసీఐ పంపనుంది. గతేడాది జరగాల్సిన ఆసియా గేమ్స్​.. చైనా జీరో కొవిడ్ పాలసీ వల్ల వాయిదా పడ్డాయి. ఐసీసీ మెగా టోర్నీకి ముందు ఇండియా-పాకిస్థాన్‌ జట్లు ఆసియాకప్‌, ఆసియా గేమ్స్​ 2023లో రెండు సార్లు తలపడే అవకాశం ఉంది.

India ICC World Cup 2023 : ఐసీసీ మెగా టోర్నీకి ఇంకా కొన్ని నెలల సమయమే ఉంది. ఇప్పటికే కొందరు ప్లేయర్లు గాయాల బారిన పడి జట్టుకు దూరమవ్వగా.. మరి కొందరు ప్లేయర్లు ఫామ్​లో లేకపోవడం, నిలకడ ప్రదర్శించకపోవడం వల్ల జట్టు పరిస్థితి దిగజారింది. దీనిపై మాజీ క్రికెట్ దిగ్గజం దిలీప్​ వెంగ్​సర్కార్​ తీవ్ర స్థాయిలో స్పందించారు. బీసీసీఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అక్టోబర్​లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్​ కప్ 2023​పై ఆందోళన నెలకొంది. భారత్​ ఐసీసీ ట్రోఫీ గెలిచి 23 జూన్​ 2023 నాటికి పదేళ్లు పూర్తయింది. ఈ మధ్యకాలంలో జరిగిన ఐసీసీ టోర్నీల్లో టీమ్​ఇండియాకు నిరాశే మిగిలింది. దీంతో ఈసారైనా ఇండియా వరల్డ్​ కప్​ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.