ETV Bharat / sports

రోజుకు రూ.82 వేలు పెంపు.. ఫస్ట్​ క్లాస్​ టికెట్​​.. వారందరికీ BCCI బంపర్​ ఆఫర్​! - సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితా జడేజా

ఆఫీస్​ బేరర్ల భత్యాలను బీసీసీఐ పెంచింది. దాంతో పాటు ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌తో ప్రయాణించేందుకు అనుమతినిచ్చింది.

bcci
bcci
author img

By

Published : Apr 10, 2023, 3:06 PM IST

Updated : Apr 10, 2023, 7:16 PM IST

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి.. ఆఫీస్​ బేరర్ల భత్యాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశీ పర్యటనలకు వెళ్లే ఆఫీస్​ బేరర్ల భత్యాలను పెంచింది. వాటితో పాటు ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌తో ప్రయాణించేందుకు కూడా అనుమతినిచ్చింది. రోజువారీ అలవెన్స్‌ను 1000 డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా అపెక్స్‌ కౌన్సిల్ భేటీలో బీసీసీఐ ప్రతిపాదించినప్పటికీ.. ఇలాంటి సౌకర్యాలను గతేడాది అక్టోబర్‌ నుంచే అమల్లోకి తీసుకొచ్చింది.

అయితే బీసీసీఐ.. దాదాపు ఏడేళ్ల తర్వాత రోజువారీ అలవెన్స్‌లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు 750 డాలర్లుగా ఉండే అలవెన్స్‌ను వెయ్యికి పెంచింది. దేశంలో జరిగే సమావేశాలకు హాజరయ్యే బీసీసీఐ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్, సంయుక్త కార్యదర్శి సహా ఆఫీస్‌ బేరర్లకు రోజుకు రూ.40వేల అలవెన్స్‌ను బీసీసీఐ చెల్లించనుంది. బిజినెస్ క్లాస్‌ టికెట్‌ ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది.

  • 'వర్క్‌ ట్రావెల్‌' కోసం రోజుకు రూ. 30వేలు, సూట్‌ రూమ్‌ బుక్‌ చేసుకొనే వెసులుబాటు ఉంది. ఐపీఎల్‌ ఛైర్మన్‌కు కూడా ఆఫీస్ బేరర్స్‌ కేటగిరీలో అలవెన్సులు వర్తిస్తాయి.
  • బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్, ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కూడా త్రైమాసిక సమావేశాలకు హాజరైతే రూ.40వేలు, విదేశీ పర్యటనలకు వెళ్తే 500 డాలర్లను రోజువారీ అలవెన్సులుగా చెల్లిస్తుంది.
  • ముగ్గురు సభ్యులు కలిగిన క్రికెట్ సలహా కమిటీ, పురుష, మహిళా జట్ల ప్రధాన కోచ్‌లు హాజరయ్యే ప్రతి సమావేశానికి రూ.3.5 లక్షలు ఇవ్వనుంది.
  • సమావేశాల కోసం విదేశీ ప్రయాణాలు అవసరంలేనప్పటికీ.. ఒకవేళ వెళ్తే మాత్రం రోజుకు 400 డాలర్లు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. వీరంతా గౌరవ పదవుల్లో ఉండే ఆఫీస్ బేరర్ల కేటగిరీలోకి వస్తారు.
  • బీసీసీఐ సీఈవో.. విదేశీ పర్యటనకు వెళ్తే 650 డాలర్లు, స్వదేశంలో అయితే రూ.15 వేలను భత్యంగా చెల్లిస్తుంది.

సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితా రిలీజ్​
2022-23 ఏడాదికి గాను టీమ్​ఇండియా ఆట‌గాళ్ల సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితాను బీసీసీఐ ఇటీవలే విడుదల చేసింది. నాలుగు గ్రేడ్స్‌లో మొత్తం 26 మంది భారత క్రికెట్​ జట్టు ఆట‌గాళ్ల‌కు సెంట్ర‌ల్‌ కాంట్రాక్ట్‌లో చోటు క‌ల్పించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అద‌ర‌గొట్టిన భారత క్రికెట్​ జట్టు ఆల్​రౌండర్​ రవీంద్ర జ‌డేజాకు ప్ర‌మోష‌న్ ద‌క్కింది. ఏ ప్ల‌స్ గ్రేడ్ ప్లేయ‌ర్‌గా జ‌డేజా స్థానం సొంతం చేసుకున్నాడు. గ‌త కొంత‌కాలంగా వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతున్న కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఏ గ్రేడ్ నుంచి అత‌డిని తొల‌గించి బీ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. మరో ఆల్​రౌండ‌ర్ హార్దిక్ పాండ్య బీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్‌కు ప్ర‌మోష‌న్ పొందాడు. రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన రిష‌బ్ పంత్ ఏ గ్రేడ్‌లో స్థానం నిలుపుకోగా.. వెన్ను గాయంతో జ‌ట్టుకు దూరంగా ఉన్నా బుమ్రాకు ఏ ప్ల‌స్ గ్రేడ్‌లో తన స్థానాన్ని ప‌దిలం చేసుకున్నాడు. సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌లో చోటు ద‌క్కించుకున్న మిగాతా ఆటగాళ్ల జాబితా కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Apr 10, 2023, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.