ETV Bharat / sports

రాహుల్​, పంత్​కు బీసీసీఐ ప్రమోషన్.. అయ్యర్​, పటేల్​కు ఛాన్స్​!

author img

By

Published : Jan 20, 2022, 8:25 PM IST

BCCI Central Contract: టెస్టు కెప్టెన్సీ రేసులో ఉన్న కేఎల్​ రాహుల్​, రిషభ్​ పంత్​కు.. సెంట్రల్​ కాంట్రాక్ట్​లో ప్రమోషన్​ లభించే అవకాశముందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. వారికి ఏ ప్లస్​ కేటగిరి దక్కవచ్చని అన్నారు. కాగా, 'ఏ' కేటగిరిలో ఉన్న పుజారా, రహానె, హార్దిక్​, ఇషాంత్​ శర్మ ఇకపై 'బి' గ్రూప్​లో కొనసాగొచ్చని తెలిసింది.

BCCI Central Contract  Kl Rahul Pant Promotion
కేఎల్​ రాహుల్​, పంత్ సెంట్రల్​ కాంట్రాక్ట్

BCCI Central Contract: బీసీసీఐ త్వరలోనే ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్​ విషయమై చర్చలు జరిపి మార్పులు చేసే అవకాశముందని తెలిసింది. ప్రస్తుతం గ్రూప్​-ఏలో.. టెస్టు కెప్టెన్సీ రేసులో ఉన్న కేఎల్​ రాహుల్​, పంత్​కు ప్రమోషన్​ లభించొచ్చని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. వారిని కోహ్లీ, రోహిత్​, బుమ్రా కొనసాగుతున్న 'ఏ ప్లస్'​ కేటగిరిలోకి మార్చవచ్చని అన్నారు.

గత కొంతకాలంగా ఫామ్​లో లేక ఇబ్బంది పడుతున్న సీనియర్​ బ్యాటర్స్​ రహానె, పుజారాను 'ఏ' కేటగిరిలోనే ఉంచాలా? లేదా? అన్న విషయంపై కూడా చర్చ జరగవచ్చని పేర్కొన్నారు.

మెరుగైన ప్రదర్శన చేయలేక సతమతమవుతున్న హార్దిక్​ పాండ్యా, ఇషాంత్​ శర్మను గ్రూప్ ఏ నుంచి బీకి మార్చొచ్చని కూడా తెలిసింది. ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న శార్దూల్​ ఠాకూర్​ను గ్రూప్​ బీ నుంచి ఏకు.. గ్రూప్​ సీలో ఉన్న సిరాజ్​, శుభమన్​ గిల్​, హనుమ విహారికి కూడా ప్రమోషన్​ లభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్​ అయ్యర్​, హర్షల్​ పటేల్​కు సెంట్రల్​ కాంట్రాక్ట్​ దక్కవచ్చని క్రికెట్​ వర్గాలు పేర్కొన్నాయి. ​

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

జేసన్​ రాయ్​ విధ్వంసం.. 36 బంతుల్లో సెంచరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.