ETV Bharat / sports

బాల్​ ట్యాంపరింగ్: దిద్దుబాటు చర్యల్లో ప్లేయర్లు! - హేజిల్​వుడ్

బాల్​ ట్యాంపరింగ్ అంశంపై ఆసీస్ క్రికెటర్లు ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతున్నారు. వివాదానికి తెరలేపిన బాన్​క్రాఫ్ట్​.. ఇప్పుడు దాని గురించి కొత్తగా చెప్పడానికేమీ లేదని అంటున్నాడు. కాగా, నాటి జట్టులోని ఆసీస్ బౌలర్లు.. తమకేమీ తెలియదని.. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయండని కోరుతున్నారు.

starc, cummins, hazelwood
మిచెల్ స్టార్క్, కమిన్స్, హేజిల్​వుడ్
author img

By

Published : May 18, 2021, 6:37 PM IST

బాన్​క్రాఫ్ట్​ వ్యాఖ్యలతో మళ్లీ చర్చనీయాంశమైన బాల్​ ట్యాంపరింగ్ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా నష్టనివారణకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. సాండ్​గేట్​ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదంటూ వెనక్కి తగ్గాడు ఆసీస్ క్రికెటర్​ బాన్​క్రాఫ్ట్. ఆరోపణలు ఎదుర్కొంటున్న బౌలర్లూ... ఈ వ్యవహారానికి ఇక్కడితో ముగింపు పలకాలంటూ సంయుక్త ప్రకటన చేశారు.

ఇదీ చదవండి: బాల్ ట్యాంపరింగ్ రగడపై బాన్​క్రాఫ్ట్ వెనకడుగు!

మాకేం తెలీదు..

బాల్​ ట్యాంపరింగ్ వివాదంపై నాటి ఆస్ట్రేలియా జట్టులోని బౌలర్లు సంయుక్త ప్రకటన చేశారు. దాని గురించి తమకేమీ తెలియదని.. ఈ విషయానికి ఇంతటితో ముగింపు పలకాలని పేర్కొన్నారు.

"మా నిజాయితీ పట్ల మేము గర్వంగా ఉన్నాం. కానీ, ఇటీవల బాల్ ట్యాంపరింగ్ వివాదానికి సంబంధించి మమ్మల్ని తప్పుపట్టడం వల్ల కొంత బాధేసింది. మీడియాతో పాటు మాజీ ఆటగాళ్లు మమ్మల్ని ప్రశ్నించడం బాధాకరం. నాటి సంఘటనకు సంబంధించి ఏం జరిగిందో తెలియజేయాలని మాపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ, అప్పుడు మైదానంలో ఏం జరిగిందో మాకేమీ తెలీదు" అని నలుగురు బౌలర్లు సంయుక్త ప్రకటన చేశారు.

2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో కమిన్స్​, హేజిల్​వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్.. నాటి ఆస్ట్రేలియా జట్టులో ఉన్నారు.

ఇదీ చదవండి: 'బాల్ టాంపరింగ్ వివాదంపై వార్నర్ బుక్ రాయాలి'

2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆసీస్ బ్యాట్స్​మన్​ కామెరూన్​ బాన్​క్రాఫ్ట్​ బంతికి ఉప్పుకాగితం రుద్దుతూ అడ్డంగా దొరికాడు. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్లు గమనించారు. ఇందులో కెప్టెన్ స్మిత్​తో పాటు వైస్ కెప్టెన్ వార్నర్​ పాత్ర ఉన్నట్లు తేలింది. వీరిద్దరినీ క్రికెట్ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయగా.. ప్రధాన సూత్రధారి బాన్​క్రాఫ్ట్​ను తొమ్మిది నెలలు ఆటకు దూరం చేశారు. అయితే ఈ విషయంపై బౌలర్లందరికీ ముందే సమాచారముందని బాన్​క్రాఫ్ట్ ఇటీవల తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.