ETV Bharat / sports

అరుదైన ఘనత సాధించిన బంగ్లా బ్యాటర్​- కోహ్లీ, స్మిత్ రికార్డు సమం! - బంగ్లా వర్సెస్​ న్యూజిలాండ్​ టెస్ట్​ మ్యాచ్​

Ban Vs NZ 1st Test : బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్​ నజ్ముల్ హొస్సేన్ శాంటో చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్​లో ఎంట్రీ ఇచ్చిన తొలి టెస్టులోనే శతకం బాదాడు. ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌గా రికార్డులోకెక్కాడు.

Ban Vs NZ 1st Test Najmul Hossain Shanto Record
Ban Vs NZ 1st Test Captain Najmul Hossain Shanto Record
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 10:36 PM IST

Ban Vs NZ 1st Test : బంగ్లాదేశ్​లోని సిల్హెట్‌ వేదికగా గురువారం న్యూజిలాండ్​-బంగ్లాదేశ్​ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్​లో విజృంభించాడు బంగ్లా కెప్టెన్​ నజ్ముల్ హొస్సేన్ శాంటో. అరంగేట్రం చేసిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో విరుచుకుపడ్డాడు. 192 బంతుల్లో 10 ఫోర్లతో శాంటో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. నజ్ముల్ చేసిన ఈ ఫీట్..​ న్యూజిలాండ్‌పై 205 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించడంలో బంగ్లాదేశ్​కు సహాయపడింది. దీంతో టెస్టుల్లో తన 5వ సెంచరీని నమోదు చేసుకున్నాడు శాంటో.

తొలి బంగ్లా క్రికెటర్‌గా..
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన షాంటో ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్రంలోనే టెస్టుల్లో సెంచరీ సాధించిన కెప్టెన్​గా, తొలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌గా షాంటో చరిత్ర సృష్టించాడు. మొత్తంగా టెస్టు కెప్టెన్సీ అరంగేట్రంలో శకతం బాదిన 32వ క్రికెటర్‌గా షాంటో నిలిచాడు. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌, జో రూట్​ వంటి దిగ్గజ క్రికెటర్లూ ఉన్నారు.

కేన్​ కూడా..
మరోవైపు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్​ కూడా ఈ సిరీస్​లో కీలకమైన మైలురాయిని అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో 29వ సెంచరీని పూర్తి చేసి ఆల్‌టైమ్ గ్రేట్, ఆసీస్‌ దిగ్గజం బ్రాడ్‌మన్‌, టీమ్​ఇండియా స్టార్​ క్రికెటర్​ విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. ఇదే తొలి టెస్టు మ్యాచ్‌లో విలియమ్సన్ 205 బంతుల్లో 104 పరుగులు చేసి ఔటయ్యాడు. 95వ టెస్టు మ్యాచ్‌లో విలియమ్సన్ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్​ 3 వికెట్ల కోల్పోయి 212 పరుగులు చేసింది. నాల్గో వికెట్‌కు శాంటోతో కలిసి 96 పరుగులు భాగస్వామ్యం జోడించిన తర్వాత ముస్తిఫిజర్‌ 43 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక శాంటో(104)తో క్రీజులో కొనసాగుతున్నాడు. కేవలం 12 బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టడం వల్ల న్యూజిలాండ్​ మళ్లీ పుంజుకున్నట్లే కనిపించింది. అయితే ఈ క్రమంలో మూడో వికెట్‌కు శాంటో, మోమినుల్ హక్​ కలిసి 90 పరుగులు జోడించడం వల్ల బంగ్లాదేశ్‌ మెరుగైన స్థితిలో నిలిచింది.

దక్షిణాఫ్రికా టీ20 టూర్​కు హార్దిక్​ దూరం- రోహిత్​కు కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్​!

ఎంత వ్యతిరేకత వచ్చినా తగ్గలేదు - ఫ్రెండ్లీ స్పిరిట్​తో ముందుకు సాగిన మిస్టర్ డిపెండబుల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.