ETV Bharat / sports

IND VS BAN: బంగ్లాతో రెండో టెస్ట్​.. మనోళ్లను ఊరిస్తున్న రికార్డులివే! - బంగ్లాదేశ్​ భారత్​కు జరిగిన రెండో టెస్ట్​ మ్యాచ్

బంగ్లాదేశ్​తో జరగనున్న రెండో టెస్టుకు ముందుకు టీమ్​ఇండియా క్రికెటర్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటంటే..

teamindia records
మూడు రికార్డులను సొంతం
author img

By

Published : Dec 20, 2022, 3:08 PM IST

బంగ్లాదేశ్​తో జరిగిన మొదటి టెస్ట్​ మ్యాచ్​లో అద్భుత విజయాన్ని అందుకుంది టీమ్​ఇండియా. ప్రస్తుతం డిసెంబర్​ 22న జరగబోయే రెండో టెస్ట్​​ మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు భారత క్రికెటర్లు.. పలు రికార్డులకు అడుగు దూరంలో ఉన్నారు. అవేంటంటే..

మరో ఆరు సాధిస్తే.. భారత జట్టులోకి ఆలస్యంగా వచ్చిన ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్​ పటేల్​ తన కెరీర్​లో​ ఇప్పటి వరకు తన టెస్టు కెరీర్​లో 44 వికెట్లు తీశాడు. తాజాగా బంగ్లాదేశ్​తో జరిగే చివరి టెస్ట్​ మ్యాచ్​లో మరో ఆరు వికెట్లు పడగొట్టగలిగితే టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు మరో భారత క్రికెటర్​ రవిచంద్రన్​ అశ్విన్​ పేరు మీద ఉంది. అతడు 2012లో తన తొమ్మిదో మ్యాచ్​లో ఇంగ్లాండ్​పై 50వ వికెట్​ తీశాడు.

ఛేతేశ్వర్​ పుజారా.. బంగ్లాతో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో 90 పరుగులతో మంచి ఇన్నింగ్స్​ ఆడిన పుజారా.. మరో 16 పరుగులు చేస్తే.. ఏడు వేల పరుగుల మార్క్​ను అందుకుంటాడు. ఇది జరిగితే అతడు టెస్టు మ్యాచుల్లో ఏడువేల పరుగులు చేసిన ఏడో భారత క్రికెటర్​గా నిలుస్తాడు. ఇప్పటి వరకు 97 టెస్టుల్లో 6984 పరుగులు చేశాడు.

మహ్మద్ సిరాజ్.. ఈ హైదరాబాద్​ పేసర్ 2022లో​​ అంతర్జాతీయ క్రికెట్​లో ఇప్పటివరకు 39 వికెట్లను పడగొట్టాడు. డిసెంబర్​ 22న బంగ్లాతో జరిగే చివరి టెస్ట్​ మ్యాచ్​లో మరో ఒక్క వికెట్​ సాధిస్తే.. ఈ ఏడాది ఎక్కువ అంతర్జాతీయ వికెట్లను పడగొట్టిన భారత్ పేసర్​గా నిలుస్తాడు. కాగా, మరో పేసర్​ బుమ్రా కూడా ఈ ఏడాది ఇప్పటివరకు 39 అంతర్జాతీయ వికెట్లను తీశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.