ETV Bharat / sports

WTC Final: 'కోహ్లీనే కాదు ఎవ్వరైనా ఔట్ కావాల్సిందే' - డబ్ల్యూటీసీ ఫైనల్

వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్​లో కోహ్లీతో పాటు మరో నాలుగు వికెట్లు తీసిన కివీస్ బౌలర్ జెమీసన్.. వాటి గురించి మాట్లాడాడు. ప్రస్తుతం తమ జట్టు ఆధిక్యంలో ఉండటంపై ఆనందం వ్యక్తం చేశాడు. సౌథాంప్టన్​ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.

Virat
విరాట్
author img

By

Published : Jun 21, 2021, 12:59 PM IST

సౌథాంప్టన్​లో జరుగుతున్న టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్లో(WTC Final) భారత్​పై మూడో రోజు పైచేయి సాధించింది న్యూజిలాండ్. టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీతో పాటు మరో నాలుగు వికెట్లు తీసిన కివీస్ పేసర్ కైల్ జెమీసన్(Kyle Jamieson) అదరగొట్టాడు. తాను వేసిన బంతి కోహ్లీనే కాదు ఎవరైనా సరే ఔట్ కావాల్సిందేనని అన్నాడు.

"విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేసేందుకు న్యూజిలాండ్‌ ఒకే వ్యూహం అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఆ దేశంలో ఆడినప్పుడూ ఔట్‌స్వింగర్లతో విసిగించి అకస్మాత్తుగా ఇన్‌స్వింగర్‌ విసిరి ఔట్‌ చేశారు. ఇప్పుడూ దానినే అనుసరించారా" అని ప్రశ్నించగా.. "ఓహ్‌.. అవుననే అనుకుంటాను. బహుశా మేం ఈ వ్యూహం గురించే ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేసిన బంతిని కాస్త బ్యాక్‌ ఆఫ్‌ లెంగ్త్‌గా విసిరాను. దానిని నియంత్రించడం ఏ బౌలర్‌కైనా కష్టమే. మెరుగ్గా ఆడటం ఏ బ్యాటర్‌కైనా ఇబ్బందే. అది కేవలం కోహ్లీ కోసమే కాదు" అని జేమీసన్‌ చెప్పాడు.

NewZealnd
న్యూజిలాండ్

విరాట్‌ కోహ్లీది కీలకమైన వికెట్ అని జెమీసన్‌ అన్నాడు. "అవును, విరాట్‌ కోహ్లీ టీమ్‌ఇండియాలో అత్యంత కీలకం. అతడిని ఔట్‌ చేయడం సులభం కాదు. ఉదయం త్వరగా అతడిని ఔట్‌ చేయడం మాకు ఆనందాన్నిచ్చింది. ఆ తర్వాత ఆట మాకు అనుకూలంగానే సాగింది. నిజానికి కోహ్లీ బ్యాటింగ్‌లో సాంకేతిక సమస్యలేమీ కనిపించవు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరు. ఏదేమైనా నిలకడగా బంతిని రెండువైపులా స్వింగ్‌ చేయడం సంతృప్తి కలిగించింది. దాంతోనే విరాట్‌ను నియంత్రణలో ఉంచాం" అని అతడు వివరించాడు.

వర్షం ఆటంకం కలిగించినా తమ జట్టు ఆధిపత్యంలో ఉండటం సంతోషానిచ్చిందని తెలిపాడు జెమీసన్. టీమ్ఇండియాను 200 వరకే కట్టడి చేసి తాము 100కు రెండు వికెట్లే కోల్పోవడం చూస్తే తాము గొప్ప స్థితిలో ఉన్నామని అర్థమవుతుందని వెల్లడించాడు.

"ప్రస్తుతం వాతావరణం బాగా లేదు. అయినా మేము గొప్ప స్థితిలో నిలిచాం. టీమ్ఇండియాను 200 వరకే కట్టడి చేసి 100 పరుగులకు 2 వికెట్లే కోల్పోయాం. నాలుగో రోజు ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతం ఉన్న స్థితిని చూస్తే మాకు సంతోషంగా ఉంది. భారత్​కు ఎంత ఆధిక్యం ఇస్తామన్నది ఇప్పుడే చెప్పలేం. ఎక్కువగా ఇవ్వాలనే అందరూ చూస్తారు. 50, 100, 150 ఎంత ఆధిక్యం లభించినా సంతోషమే" అని పేర్కొన్నాడు జెమీసన్.

జెమీసన్‌ అనుకున్నట్టుగానే న్యూజిలాండ్‌ను ముందంజలో నిలిపాడు. తన ఎత్తు, పేస్‌తో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. కేవలం 31 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రిషభ్‌ పంత్‌, ఇషాంత్‌, బుమ్రాను ఔట్‌ చేశాడు. అతడు 22 ఓవర్లు వేస్తే అందులో 12 మెయిడిన్లే ఉన్నాయి.

ఇవీ చూడండి: Tokyo Olympics: ఒలింపిక్స్​లో తొలిసారి ఓ ట్రాన్స్​జెండర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.