ETV Bharat / sports

కోహ్లీతో ఏం మాట్లాడారని ప్రశ్న.. బాబర్ అజామ్ సీరియస్ - విరాట్ కోహ్లీ లేటెస్ట్ న్యూస్

Babar Azam on Virat Kohli: టీ20 ప్రపంచకప్​లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది పాక్. అయితే ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీతో మాట్లాడిన అజామ్.. అతడికి ఏదో చెప్పాడు. ఇదే విషయంపై అజామ్​ను ఓ విలేకరి ప్రశ్నించగా.. అందుకు అతడు అసహనం వ్యక్తం చేశాడు.

babar azam
babar azam
author img

By

Published : Dec 13, 2021, 1:30 PM IST

Babar Azam on Virat Kohli: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లో పాక్ ఘనవిజయం సాధించింది. అనంతరం ఆటగాళ్లు పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో కోహ్లీతో ఏదో మాట్లాడాడు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్. చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు. తాజాగా ఇదే విషయమై అజామ్​ను ప్రశ్నించాడు ఓ విలేకరి. దీనిపై అసహనం వ్యక్తం చేశాడు అజామ్.

'మా మధ్య ఏం జరిగిందో అందరి ముందు చెప్పను. అది మా ఇద్దరి మధ్య విషయం. దానిని మీ ముందు చెప్పాల్సిన అవసరం లేదు' అంటూ సమాధానమిచ్చాడు అజామ్.

ఈ మ్యాచ్​లో టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియాపై ఆది నుంచి పాకిస్థాన్​ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. 20ఓవర్లకు భారత జట్టు 151 పరుగులు సాధించింది. కాగా రెండో ఇన్నింగ్స్​లో స్వేచ్ఛగా ఆడిన పాక్​.. 10వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్​లో భారత్​పై తొలి గెలుపును ఆస్వాదించింది.

ఇవీ చూడండి: టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని కోహ్లీని కోరా: గంగూలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.