Babar Azam 5000 Runs In ODI : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. బాబర్ 97 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. గతంలో అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన రికార్డు సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. హషీమ్ ఈ మైలురాయిని చేరుకోవడానికి 101 ఇన్నింగ్స్‌లు పట్టింది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ, వీవీ రిచర్డ్ 114 ఇన్నింగ్స్‌ల్లో 5000 పరుగుల మార్క్‌ను దాటారు. ఆసీస్ హిట్టర్ డేవిడ్ వార్నర్ 115 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు.
శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో.. బాబర్(107) శకత ప్రదర్శన చేశాడు. 19 పరుగుల వద్ద 5000 పరుగుల మైలురాయిని దాటాడు. గతేడాది హషీమ్ ఆమ్లా పేరిట ఉన్న 4000 పరుగుల రికార్డును.. బాబర్ కొద్దిపాటి తేడాతో అధిగమించాడు. ఆమ్లా 81 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా, బాబర్ 82 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అధిగమించాడు. గత రెండేళ్లుగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న బాబర్.. 5000 పరుగులు పూర్తి చేసిన 14వ పాక్ క్రికెటర్‌గా నిలిచాడు.
ప్రస్తుతం పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా నాలుగో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు ఇరగదీసింది. అద్భుత ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ఫకార్ జమాన్ (14) పరుగులకే పెవిలియన్ చేరగా.. ఆ తర్వాత వచ్చిన మసూద్ (44) మాత్రం స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక, కెప్టెన్ బాబర్ అజామ్ (107) శతక్కొట్టాడు. అఘా సల్మాన్ (58) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. వికెట్ కీపర్ రిజ్వాన్ (24), ఇఫ్తికార్ అహ్మద్ (28), షహీద్ అఫ్రిది (27*), మహ్మద్ హారిస్ (17*) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ (3) వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. బెన్ లిస్టర్, ఇశ్ సోధి చెరో వికెట్ తీశారు.
New zealand Tour Of Pakistan : ఇప్పటికే జరిగిన మూడు మ్యాచ్‌ల్లో 3-0 తేడాతో పాకిస్థాన్ అధిక్యంలో ఉంది. ఇక, ఐదో వన్డే మే 7న కరాచీలో జరగనుంది. అంతకుమందు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్.. 2-2 తో సమం అయింది.