ETV Bharat / sports

HCA issue: అజహరుద్దీన్- అపెక్స్ కౌన్సిల్ మధ్య రగడ - క్రికెట్ న్యూస్

హెచ్​సీఏ ప్రెసిడెంట్​గా తనను సస్పెండ్ చేయడంపై అజహరుద్దీన్ ఘాటుగా స్పందించారు. దీనిపై అపెక్స్ కౌన్సిల్​ కూడా తక్షణమే స్పందించింది. ఇప్పటి నుంచి ఆయన హెచ్​సీఏ అధ్యక్షుడు కాదని తేల్చి చెప్పింది.

azharuddin responds on HCA issue
అజహరుద్దీన్
author img

By

Published : Jun 17, 2021, 12:04 PM IST

Updated : Jun 17, 2021, 1:06 PM IST

హైదరాబాద్​ క్రికెట్ సంఘం(hyderabad cricket association) అధ్యక్షుడి అయిన తనకు నోటీసులు ఇవ్వడంపై మహమ్మద్ అజహరుద్దీన్ స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. హెచ్​సీఏ గౌరవానికి భంగం కలిగేలా తానెప్పుడూ పనిచేయలేదని అన్నారు. అపెక్స్ కౌన్సిల్​లో ఉన్న తొమ్మిది మందిలో ఐదుగురు ఓ వర్గంగా ఏర్పడ్డారని తెలిపారు. తాము చేసిందే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా భావిస్తే ఎలా అని ప్రశ్నించారు.

హెచ్​సీఏలో జరుగుతున్న జరిగిన అవినీతిని అరికట్టడానికి సమర్థమంతమైన వ్యక్తిని అంబుడ్స్​మెన్​గా నియమిస్తే ఆ ఐదుగురే తప్పు పట్టారని అజహరుద్దీన్ పేర్కొన్నారు. వాళ్ల అవినీతి బయట పడుతుందనే ఇలా చేశారని ఆరోపించారు.

ఈ విషయంపై తక్షణమే హెచ్​సీఏ అపెక్స్ కౌన్సిల్ కూడా స్పందించింది. లోధా సిఫార్సుల మేరకే నోటిసులు ఇచ్చామని స్పష్టం చేసింది. కౌన్సిల్​లో వర్గాలు ఉన్నాయని అజహరుద్దీన్ అనడం సరికాదని చెప్పింది. ఈరోజు(గురువారం) నుంచి అజహరుద్దీన్ హెచ్​సీఏ అధ్యక్షుడు కాదని వెల్లడించింది. వీలైతే ఆయన కోర్టుకు వెళ్లి పోరాటం చేసుకోవచ్చని తెలిపింది. బీసీసీఐ జోక్యం ఈ విషయంలో ఉండదని తేల్చి చెప్పింది.

Last Updated : Jun 17, 2021, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.