ETV Bharat / sports

ఫైనల్స్​కు ముందు టీమ్ఇండియాకు షాక్.. అక్షర్ దూరం.. ఆ స్థానంలో యంగ్​ స్టార్​ ఎంట్రీ! - భారత్ ఆసియా కప్ టైటిళ్లు

Axar Patel Injury : 2023 ఆసియా కప్ తుది దశకు చేరుకుంది. ఆదివారం ఫైనల్ మ్యాచ్​తో ఈ సీజన్​కు తెరపడనుంది. కొలంబో పి. ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగే ఫైనల్​ మ్యాచ్​లో భారత్.. శ్రీలంకను ఢీకొట్టనుంది. అయితే ఈ మ్యాచ్​కు టీమ్ఇండియా ప్లేయర్ అక్షర్​ పటేల్​ దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయితే అతని స్థానంలో మరో ప్లేయర్​ రానున్నాడు. ఇంతకీ అతను ఎవరంటే ?

Axar Patel Injury
Axar Patel Injury
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 3:38 PM IST

Updated : Sep 16, 2023, 4:23 PM IST

Axar Patel Injury : 2023 ఆసియా కప్ సూపర్ 4 చివరి మ్యాచ్​లో భారత్​పై.. బంగ్లాదేశ్ 6 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్​లో భారత్​ను గెలిపించేందుకు టీమ్ఇండియా ఆల్​రౌండర్ అక్షర్ పటేల్.. ఆఖర్లో బాగానే చెమటోడ్చాడు. ఈ క్రమంలో అతడు గాయపడ్డాడు. క్రీజును వదిలి ఆడుతున్న అక్షర్.. స్టంపౌట్‌ అయ్యేవాడు.

అతడు ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. కుడిచేతి చిటికెన వేలికి గాయమైంది. తర్వాత కొంతసేపటికి ఆటలో భాగంగా.. బంగ్లా ఫీల్డర్ విసిరిన బంతి అతడి చేతిని బలంగా తాకింది. అయినప్పటికీ అక్షర్ క్రీజును వీడలేదు. చేతికి పట్టీ వేసుకొని మరీ ఆడాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆక్షర్.. ఫైనల్ మ్యాచ్​కు అందుబాటులో ఉండటం కష్టమేనని తెలుస్తోంది.

గాయపడిన అక్షర్ పటేల్ స్థానాన్ని.. మరో ఆల్​రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో భర్తీ చేయాలని జట్టు మేనేజ్​మెంట్ భావిస్తోందట. " ఆల్​రౌండర్ అక్షర్ గాయాలతో సతమతమౌతున్నాడు. గత మ్యాచ్​లో చిటికెన వేలు, మోచేయికి గాయం అవ్వడమే కాకుండా.. తొడ కండరాలు పట్టేశాయి. అందుకే అతడికి విశ్రాంతి అవసరం. దీంతో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించాలని ప్రయత్నిస్తున్నాం" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ మినీ టోర్నమెంట్​ కోసం బీసీసీఐ ప్రకటించిన టీమ్ఇండియా జట్టులో.. వాషింగ్టన్ సుందర్ లేడు. మరి స్పిన్​కు సహకరించే పిచ్​పై అక్షర్ స్థానాన్ని భర్తీ చేయడానికి.. సుందర్​ను శ్రీలంక పిలిపించినట్లు సమాచారం. ఒకవేళ సుందర్ టీమ్ఇండియాతో చేరినా.. అతడికి తుది జట్టులో ప్లేస్ లభిస్తుందా లేదా అనేది అనుమానమే.

Asia Cup 2023 Trophy Tour : ఆసియా క్రికెట్ కౌన్సిల్.. 'ట్రోఫీ టూర్' పేరుతో ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్ ట్రోఫీని కొలంబో నగర వీధుల్లో తిప్పుతోంది. ఈ ర్యాలీలో క్రికెట్ ఫ్యాన్స్​ పాల్గొని ట్రోఫీతో సెల్ఫీ తీసుకుంటున్నారు. ఇక ఆదివారం జరిగే ఫైనల్స్​లో విజేతగా నిలిచిన జట్టు ట్రోఫీని ముద్దాడనుంది. అయితే ఇప్పటికే 7 సార్లు (6 వన్డే, 1 టీ20 ఫార్మాట్) ట్రోఫీని గెలుచుకున్న భారత్.. ఎనిమిదో టైటిల్​ను గెలుచుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు ఆరు టైటిళ్లతో ఉన్న శ్రీలంక మరో టైటిల్ గెలిచి భారత్ రికార్డును సమం చేయాలని భావిస్తోంది.

Ind Vs Ban Asia Cup Records : 1000కి పైగా పరుగులు.. ఏడాదిలో ఆరో సెంచరీ.. భారత్​-బంగ్లా మ్యాచ్ రికార్డ్స్​ ఇవే

Kohli Funny Run Viral Video : 'ఏంటీ కోహ్లీ అలా పరిగెడుతున్నావ్​?'.. ఒక్కసారిగా అంతా నవ్వులే నవ్వులు!

Last Updated : Sep 16, 2023, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.