Australia Vs Afghanistan World Cup 2023 : వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ బ్యాటర్లు అదరగొట్టేశారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి అఫ్గాన్ 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (129 నాటౌట్; 143 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. దీంతో ఆసీస్‌కు 292 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ నిర్దేశించింది.
ఇక అఫ్గాన్ బ్యాటర్లు గుర్బాజ్ (21), రహ్మాత్ షా (30), షాహిది (26), ఒమర్జాయ్ (26), నబీ(12) పరుగులు చేశారు. ఆఖర్లో రషీద్ ఖాన్ (35)*(15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, మ్యాక్స్‌వెల్, జంపా తలో వికెట్ పడగొట్టారు.
అదరగొట్టిన జద్రాన్..
ఓ వైపు వికెట్లు పడినా అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (129*) మాత్రం నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. ఈ క్రమంలో కెరీర్‌లో ఐదో సెంచరీని పూర్తి చేశాడు. వరల్డ్ కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన అఫ్గాన్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. అలాగే వరల్డ్ కప్‌లో సెంచరీ సాధించిన తొలి అఫ్గాన్ బ్యాటర్ కూడా జద్రాన్ కావడం గమనార్హం. అంతర్జాతీయంగా పిన్న వయస్సులో వరల్డ్ కప్ శతకం చేసిన నాలుగో బ్యాటర్ జద్రాన్. ఈ అఫ్గాన్ బ్యాటర్ 21 ఏళ్ల 330 రోజుల వయసులో శతకం బాదాడు.
ఆస్ట్రేలియా తుది జట్టు :
పాట్ కమిన్స్ (కెప్టెన్) , డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీష్(వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్.
అఫ్గానిస్థాన్ తుది జట్టు :
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్) , రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, నవీన్ ఉల్ హక్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్), ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్.
మెగాటోర్నీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా అఫ్గాన్-సెమీస్ చేరేందుకు ఇంకా ఛాన్స్!
SL vs AFG World Cup 2023 : శ్రీలంకపై అఫ్గాన్ ఘన విజయం.. వరల్డ్ కప్‌లో ముచ్చటగా మూడో గెలుపు