Australia Odi Squad vs India : ఇండియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ క్రికెట్ బ్రోర్డు అనౌన్స్ చేసింది. 16 మందితో కూడిన టీమ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ఉదయం ప్రకటించింది. అయితే, ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు ఈ టోర్నీని సీరియస్‌గా తీసుకున్నాయి. ఇదివరకే టీమ్ఇండియా జట్టును ప్రకటించింది. తాజాగా ప్రకటించిన జట్టులోకి.. గాయాలతో విశ్రాంతి తీసుకుంటున్న స్టార్ ఆటగాళ్లను తీసుకుంది ఆసీస్.
కాగా, ప్రస్తుతం ఆసీస్ భారత్‌తో బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆడుతోంది. ఈ నాలుగు టెస్టుల సిరీస్‌లో.. జరిగిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 తో అధిక్యంలో ఉంది టీమ్ఇండియా. రెండు టెస్టుల్లోనూ పేలవ ప్రదర్శన చేసిన కంగారూ జట్టు.. వన్డేల్లోనైనా రాణించాలని భావిస్తోంది. కొద్ది రోజులుగా గాయలతో బాధపడుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, రిచర్డ్ సన్ తిరిగొచ్చారు. దీంతో ఇప్పుడు ఆసీస్ టీమ్ బలంగానే కనబడుతోంది.
ఆస్ట్రేలియా వన్డే జట్టు : ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆష్టన్ అగార్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిష్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జై రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
భారత వన్డే జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్య(వీసీ), జడేజా, కూల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.
షెడ్యూల్ ఇదే :
- మొదటి వన్డే : మార్చి 17 ; వేదిక : ముంబయి
- రెండో వన్డే : మార్చి 19 ; వేదిక : విశాఖపట్నం
- మూడో వన్డే : మార్చి 22 ; వేదిక : చెన్నై
ఇవీ చవదండి :