ETV Bharat / sports

రక్తం కారుతున్నా మిచెల్​ స్టార్క్​ బౌలింగ్.. కమిట్‌మెంట్‌ అంటే ఇదీ! - మిచెల్​ స్టార్క్​ బౌలింగ్​

ఆస్ట్రేలియా ఫాస్ట్​ బౌలర్​ మిచెల్​ స్టార్క్​.. ఆటపై తన అంకితభావాన్ని ప్రదర్శించాడు. చేతి వేలికి రక్తం కారుతున్నా ఆగకుండా బౌలింగ్​ చేశాడు. దీంతో అతడిపై ఆసీస్​ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

australia fast bowler mitchell starc bowls despite blood dropping off his finger

author img

By

Published : Mar 2, 2023, 3:22 PM IST

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా భారత్​తో జరుగుతున్న మూడో టెస్ట్​లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్​ మిచెల్​ స్టార్క్​.. ఆటపై తన కమిట్​మెంట్​ చూపించాడు. చేతి వేలికి రక్తం కారుతున్నా ఆగకుండా బౌలింగ్​ చేశాడు. గాయం కారణంగా తొలి, రెండు టెస్ట్​లకు దూరమైన మిచెల్.. వంద శాతం ఫిట్​గా లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో మూడో టెస్ట్​ ఆడుతున్నాడు.

ఆస్ట్రేలియా జట్టు మరో బౌలర్​ కమ్​ కెప్టెన్​ పాట్​ కమిన్స్​ తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. మరో బౌలర్​ జోష్​ హేజిల్​ వుడ్​ కూడా గాయంతో దూరమయ్యాడు. దీంతో మిచెల్​ స్టార్క్​ మ్యాచ్​లో ఆడాల్సి వచ్చింది. అయితే మ్యాచ్​లో బౌలింగ్ చేస్తుండగా.. మిచెల్ స్టార్క్ చేతి వేలికి గాయమైంది. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ హిట్ చేసిన బంతి‌ని నిలువరించే క్రమంలో మిచెల్ స్టార్క్ చేతికి గాయమైంది.

ఆ సమయంలో ఎడమచేతి చూపుడు వేలి నుంచి రక్తం కారుతున్నా.. ఫ్యాంట్‌కు ఆ రక్తాన్ని తుడుచుకుంటూ మిచెల్ స్టార్క్ తన బౌలింగ్‌ను కొనసాగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్‌తో కేవలం ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించడం లేదు. రక్తం కారుతున్నా బౌలింగ్ కొనసాగించిన మిచెల్ స్టార్క్‌పై ఆ దేశ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.. కమిట్‌మెంట్ అంటే ఇదీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.