Steve Smith Ashes Record : లండన్ వేదికగా లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 9 వేల పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. జూన్ 28న మొదలైన యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్‌ను స్మిత్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడు భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందూల్కర్, భారత జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌ల పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేసినట్లయింది.
టెస్టుల్లో అత్యంత వేగంగా 9 వేల రన్స్ చేసింది వీరే..
- కుమార సంగక్కర (శ్రీలంక)- 172 ఇన్నింగ్స్.
- స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 174 ఇన్నింగ్స్.
- రాహుల్ ద్రావిడ్ (ఇండియా)- 176 ఇన్నింగ్స్.
- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 177 ఇన్నింగ్స్.
- బ్రయాన్ లారా (వెస్టిండీస్)- 177 ఇన్నింగ్స్.
- సచిన్ తెందూల్కర్ (ఇండియా)- 179 ఇన్నింగ్స్.
-
Only Kumar Sangakkara has reached 9000 Test runs in fewer innings than Steve Smith 🔥#ENGvAUS | #Ashes pic.twitter.com/g8FPQrO386
— ESPNcricinfo (@ESPNcricinfo) June 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Only Kumar Sangakkara has reached 9000 Test runs in fewer innings than Steve Smith 🔥#ENGvAUS | #Ashes pic.twitter.com/g8FPQrO386
— ESPNcricinfo (@ESPNcricinfo) June 28, 2023Only Kumar Sangakkara has reached 9000 Test runs in fewer innings than Steve Smith 🔥#ENGvAUS | #Ashes pic.twitter.com/g8FPQrO386
— ESPNcricinfo (@ESPNcricinfo) June 28, 2023
-
41 మందిలో ఒకడిగా..
Steve Smith 9000 Test Runs : యాషెస్ సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మరికొన్ని రికార్డులను కూడా నమోదు చేశాడు స్టీవ్ స్మిత్. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన స్మిత్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 15000 పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు 41 మంది ప్లేయర్స్ మాత్రమే ఈ మైలురాయిని చేరుకోగా.. వారిలో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 53.44 సగటుతో స్మిత్ కంటే కాస్త మెరుగైన యావరేజ్ రేట్‌ను కలిగి ఉన్నాడు. కాగా, స్మిత్ 49.67 సగటుతో ఉన్నాడు.
Ashes 2nd Test : ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 83 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(66) ,స్టీవ్ స్మిత్(85 నాటౌట్), ట్రావిస్ హెడ్(77) అర్ధసెంచరీలతో రాణించారు. ఉస్మాన్ ఖవాజా(17)తో కలిసి డేవిడ్ వార్నర్ తొలి వికెట్‌కు 73 పరుగులు జతచేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ వెంట వెంటనే ఔటైనా.. క్రీజ్‌లోకి వచ్చిన లబూషేన్(47) స్టీవ్ స్మిత్ కలిసి ఆసీస్‌ను ఆదుకున్నాడు. అర్ధసెంచరీకి దగ్గర్లో ఉన్న లబూషేన్‌ను రాబిన్సన్ ఔట్ చేయడంతో స్మిత్‌తో పాటు అలెక్స్ క్యారీ (11) క్రీజ్‌లోకి వచ్చాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, జో రూట్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఓలీ రాబిన్సన్ ఓ వికెట్ తీశాడు.