ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ అరుదైన ఘనత (Ellyse Perry Record) సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 300 వికెట్లు పడగొట్టింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో 5వేల పరుగులతో పాటు 300 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెట్‌గా అవతరించింది పెర్రీ.
టీమ్ఇండియాతో (INDW vs AUSW) జరుగుతున్న పింక్ బాల్ టెస్టు సందర్భంగా పూజ వికెట్‌తో పెర్రీ ఈ ఘనత దక్కించుకుంది. ఇప్పటివరకు వన్డేల్లో 3,135 పరుగులు, 152 వికెట్లు.. టీ20ల్లో 1,243 పరుగులు, 115 వికెట్లు తీసింది (Ellyse Perry Stats).
ఈ డేనైట్ టెస్టు మ్యాచ్‌లో (INDW vs AUSW Test 2021) తొలి రెండు రోజులు చెలరేగిన టీమ్ఇండియా మూడో రోజు 359/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. స్మృతి మంధాన 127 పరుగులతో సత్తాచాటగా దీప్తి శర్మ (66) ఆకట్టుకుంది. షెఫాలీ (31), పూనమ్ రౌత్ (36), మిథాలీ (30) పర్వాలేదనిపించారు.
మూడో రోజు ఆట పూర్తయ్యే సరికి.. ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులతో ఉంది. పెర్రీ(27), గార్డ్నర్(13) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్, జులన్ గోస్వామి చెరో రెండు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా ఇంకా 234 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇవీ చూడండి: