Aus vs Sa Semi Final 2023 : 2023 వరల్డ్‌కప్ రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. 49.4 ఓవర్లలో సఫారీ జట్టు 212 పరుగులు చేసి ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (101 పరుగులు) శతకంతో అదరగొట్టగా.. హెన్రిచ్ క్లాసెన్ (47) రాణించాడు. మిగతా బ్యాటర్లెవరూ ఆస్ట్రేలియా బౌలింగ్ దళాన్ని ధీటుగా ఎదుర్కోలేకపోయారు. అసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, ప్యాట్ కమిన్స్ 3, జోష్ హజెల్‌వుడ్ 2, ట్రావిస్ హెడ్ 2 వికెట్లు పడగొట్టారు.
-
➡️ From 24/4 in the 12th over
— ICC (@ICC) November 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
➡️ To 212 all out
David Miller’s 💯 has given the South Africa bowlers something to defend.
Read the live match report📝⬇️#CWC23 #SAvAUS https://t.co/qayvEZNW7J
">➡️ From 24/4 in the 12th over
— ICC (@ICC) November 16, 2023
➡️ To 212 all out
David Miller’s 💯 has given the South Africa bowlers something to defend.
Read the live match report📝⬇️#CWC23 #SAvAUS https://t.co/qayvEZNW7J➡️ From 24/4 in the 12th over
— ICC (@ICC) November 16, 2023
➡️ To 212 all out
David Miller’s 💯 has given the South Africa bowlers something to defend.
Read the live match report📝⬇️#CWC23 #SAvAUS https://t.co/qayvEZNW7J
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు పేలవమైన ఆరంభం లభించింది. ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, హజెల్‌వుడ్ నిప్పులు చెరగడం వల్ల.. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (3), టెంబ బవూమా (0), వాన్ డర్ డస్సెన్ (6), మర్క్రమ్ (10) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరాకు. దీంతో 11.5 ఓవర్లలో 24 పరుగులకే సౌతాఫ్రికా 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్లాసెన్, మిల్లర్ క్రీజులో నిలబడ్డారు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా.. స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. వీరిద్దరు 5 వికెట్‌కు 95 పరుగులు జోడించారు. తర్వాత ఆ జోడీని ట్రావిస్ హెడ్.. 30.4 ఓవర్ల వద్ద విడగొట్టాడు. ఆ తర్వాత బంతికే మార్కొ జాన్సన్ (0)ను డకౌట్ చేశాడు హెడ్.
మిల్లర్ ఒక్కడే.. సౌతాఫ్రికా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే దానికి మిల్లరే కారణం. మిల్లర్ పోరాటం వల్ల.. 24-4తో ఉన్న సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను 212 వద్ద ముగించింది. ఈ ఇన్నింగ్స్‌లో మిల్లర్ ఒక్కడే తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. సెంచరీ తర్వాత.. స్కోర్‌ను పెంచే ప్రయత్నంలో మిల్లర్ భారీ షాట్ కొట్టి హెడ్‌కు చిక్కాడు. చివర్లో గెరాల్డ్ (19), రబాడా (10) ఫర్వాలేదనిపించారు.
-
A stellar century from David Miller against all odds 👊@mastercardindia Milestones 🏏#CWC23 | #SAvAUS pic.twitter.com/mHnF6PbsE7
— ICC (@ICC) November 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A stellar century from David Miller against all odds 👊@mastercardindia Milestones 🏏#CWC23 | #SAvAUS pic.twitter.com/mHnF6PbsE7
— ICC (@ICC) November 16, 2023A stellar century from David Miller against all odds 👊@mastercardindia Milestones 🏏#CWC23 | #SAvAUS pic.twitter.com/mHnF6PbsE7
— ICC (@ICC) November 16, 2023
ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు..
- సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన లిస్ట్‌లో మిల్లర్ (138) రెండో స్థానంలో నిలిటాడు. టాప్‌లో డివిలియర్స్ (200) ఉన్నాడు.
- ఐసీసీ ఈవెంట్ నాకౌట్ మ్యాచ్‌ల్లో సెంచరీ బాదిన మూడో సౌతాఫ్రికా బ్యాటర్ మిల్లర్. అతడి కంటే ముందు.. హర్షల్ గిబ్స్ (2002లో), జాక్ కల్లిస్ (1998లో) బాదారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
విరాట్, డికాక్, రోహిత్ - పరుగుల వరద పారించిన టాప్ 10 బ్యాటర్లు
దక్షిణాఫ్రికా చేతిలో కివీస్ చిత్తు, సెంచరీలతో అదరగొట్టిన డీకాక్, డసెన్