Aus vs Nz World Cup 2023 : 2023 వరల్డ్‌కప్‌లో భాగంగా శనివారం ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మ్యాచ్.. క్రికెట్ లవర్స్‌కు మస్త్ మజానిచ్చింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ విజయం ఇరు జట్ల మధ్యలో దోబూచులాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 388 పరుగులు చేయగా.. ఛేదనలో కివీస్ 383 పరుగులకు పరిమితమైంది. దీంతో ఆసీస్ ఆఖరి బంతికి 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆసీస్.. పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అటు కివీస్ కూడా 8 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్ కారణంగా.. 3 స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో నమోదైన పలు రికార్డులేంటో చూద్దాం.
విరాట్‌ను అధిగమించిన వార్నర్.. ఈ మ్యాచ్‌లో వార్నర్ 65 బంతుల్లో.. 5 ఫోర్లు, 6 సిక్స్‌లు సహా 81 పరుగులు చేశాడు. దీంతో వరల్డ్‌కప్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (1384 పరుగులు)ని వార్నర్ (1405 ) అధిగమించాడు. ఈ జాబితాలో వీరిద్దరి కంటే ముందు సచిన్ తెందూల్కర్ (2278), రికీ పాంటింగ్ (1743), కుమార సంగక్కర (1532) ఉన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
World Cup 2023 Warner Stats : వార్నర్ ఈ మెగాటోర్నమెంట్‌లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలు బాది ఊపుమీదున్నాడు. ఇక ఆరు మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 66 సగటుతో 413 పరుగులు చేసి.. అత్యధిక పరుగులు చేసిన లిస్ట్‌లో రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇందులో 38 ఫోర్లు, 19 సిక్స్‌లు బాదాడు.
-
The streak was broken for #Mitchelstarc pic.twitter.com/OQV2dDvVNd
— Hemanth Karinki (@KarinkiHemanth) October 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The streak was broken for #Mitchelstarc pic.twitter.com/OQV2dDvVNd
— Hemanth Karinki (@KarinkiHemanth) October 28, 2023The streak was broken for #Mitchelstarc pic.twitter.com/OQV2dDvVNd
— Hemanth Karinki (@KarinkiHemanth) October 28, 2023
- ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు (383-9) చేసి ఓడిన జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.
- ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్ తన ప్రపంచకప్ కెరీర్లో వికెట్ దక్కించుకోకపోవడం ఇదే తొలిసారి. అతడు (2015,2019,2029) ఎడిషన్లలో వరుసగా 23 మ్యాచ్‌ల్లో ఆడిన ప్రతిసారి కనీసం ఒక వికెట్ పడగొట్టాడు.
- ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 32 సిక్స్‌లు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఎక్కువ సిక్స్‌లు నమోదైన రెండో మ్యాచ్‌గా నిలిచింది. టాప్‌లో ఇంగ్లాండ్ - అఫ్గానిస్థాన్ (33 సిక్స్‌లు) మ్యాచ్ ఉంది.
- ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 771 పరుగులు నమోదయ్యాయి. ఒక వన్డే మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో సౌతాఫ్రికా - ఆస్ట్రేలియా (872 పరుగులు) మ్యాచ్ ఉంది. అది 2006లో జరిగింది.
2023 World Cup Records : మెగాటోర్నీ మొనగాళ్లు వీరే.. రోహిత్, డికాక్, విరాట్ ఇంకా ఎవరంటే?
NZ vs AFG World Cup 2023 : పసికూనపై కివీస్ పంజా.. వరుసగా నాలుగో విజయంతో టాప్‌లోకి