ETV Bharat / sports

Ashes 2021: కమిన్స్ విధ్వంసం.. ఇంగ్లాండ్ 147 ఆలౌట్

AUS vs ENG Ashes 2021: బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 147 పరుగులకు ఆలౌటైంది ఇంగ్లాండ్. ఆసీస్ కెప్టెన్, పేసర్ కమిన్స్​ 5 వికెట్లతో ఇంగ్లీష్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు.

Ashes 2021 latest news, AUS vs ENG test, యాషెస్ 2021, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ టెస్టు
Ashes 2021
author img

By

Published : Dec 8, 2021, 10:27 AM IST

Updated : Dec 8, 2021, 1:28 PM IST

AUS vs ENG Ashes 2021:ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్​ను 147 పరుగులకే ఆలౌట్ చేసింది. పేస్​, బౌన్స్​ను సద్వినియోగం చేసుకుంటూ ఆసీస్ పేసర్లు చెలరేగగా.. ఇంగ్లాండ్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది.

ఇన్నింగ్స్​ తొలి బంతికే ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ (0) ను పెవిలియన్ పంపాడు స్టార్క్. తర్వాత మలన్ (6), రూట్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేశాడు హేజిల్​వుడ్. కాసేపటికే స్టోక్స్​(5).. కమిన్స్ బౌలింగ్​లో ఔటయ్యాడు. దీంతో 29 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇంగ్లీష్ జట్టు. ఆ తర్వాత మరో ఓపెనర్ హసీబ్ హమీద్​తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు ఒల్లీ పోప్. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ పరుగులు రాబట్టారు. వీరు క్రీజులో కుదురుకుంటున్న సమయంలో హమీద్​ను​ (25)ను బోల్తా కొట్టించాడు కమిన్స్. ఆ తర్వాత పోప్(35), బట్లర్(39) కాసేపు పోరాడారు. వీరు కూడా ఆరు పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. దీంతో 147 పరుగులతో సరిపెట్టుకుంది ఇంగ్లాండ్.

ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ కమిన్స్ 5 వికెట్లతో సత్తాచాటగా, స్టార్క్, హేజిల్​వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

వర్షం ఆటంకం

తొలి రోజు ఆట అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇంగ్లాండ్ ఆలౌటయ్యాక ఇన్నింగ్స్ బ్రేక్ తీసుకోగా.. ఆ సమయంలో వర్షం మొదలైంది. జోరు వాన పడటం వల్ల మొదటి రోజు మిగిలిన ఆట వీలు కాలేదు. దీంతో తొలి రోజు ఆటను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు.

ఇవీ చూడండి: 'దక్షిణాఫ్రికాలో భారత్​దే విజయం.. ఎందుకంటే?'

Last Updated : Dec 8, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.