AsiaCup 2023 Kohli Centuries : ఆసియా కప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అతడు.. లంక మ్యాచ్‌లో 12 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేసి విఫలమయ్యాడు.
లంక యంగ్ స్పిన్నర్, లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ దునిత్ వెల్లలగే బౌలింగ్‌లో సింగిల్ డిజిట్ స్కోరుకే ఔట్ అయ్యాడు. అతడు సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసి మూల్యం చెల్లించుకున్నాడు. దసున్ శనకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో.. 'నిన్న సెంచరీ.. ఈరోజేమో ఇలా', 'ఏంటి కోహ్లీ.. ఇలాగేనా ఆడేది?', '20 ఏళ్ల యంగ్ బౌలర్ చేతిలో ఔట్ అవ్వడం నీ స్థాయికి తగదు' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఇప్పటికీ ఎనిమిది సార్లు.. 2021 నుంచి ఇప్పటి వరకు లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్‌లో కోహ్లీ 159 బంతులు ఎదుర్కొన్నాడు. అందులో 13 సగటుతో 104 పరుగులు చేశాడు. ఎనిమిదిసార్లు పెవిలియన్ బాట పట్టాడు. అలా ఇప్పుడు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ లెఫ్టార్మ్ స్సిన్నర్లను ఎదుర్కోవడంలో కోహ్లీకి ఉన్న బలహీనత మరోసారి రుజువైంది.
71-77 సెంచరీ వరకు అంతే.. అయితే కోహ్లీ సెంచరీ బాదిన తర్వాత తక్కువ స్కోరుకే ఔట్ అవ్వడం కొత్తేమి కాదు. ఈ మధ్య అదే అలవాటుగా మారింది. 71వ సెంచరీ బాదినప్పుడు..ఆ తర్వాత 7 ఏడు బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులకే ఔట్ అయ్యాడు. 72వ శతకం తర్వాత ఐదు బంతుల్లో 1 పరుగు, 73వ శతకం తర్వాత 9 బంతుల్లో 4 పరుగులు, 74 సెంచరీ తర్వాత 9 బంతుల్లో 4 పరుగులు, 75 శతకం తర్వాత 9 బంతుల్లో 4 పరుగులు, 76 సెంచరీ తర్వాత 7 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు నిన్న(సెప్టెంబర్ 11) 77వ సెంచరీ తర్వాత నేడు(సెప్టెంబర్ 12) 12 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేశాడు.
పాకిస్థాన్‌పై అద్భుత సెంచరీ.. సూపర్-4లో భాగంగా సెప్టెంబర్ 11 పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 122 అజేయ పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ కెరీర్‌లో 77వ సెంచరీ, వన్డేలో 47వ శతకం బాదాడు.
-
Professor Kohli after scoring:-
— TukTuk Academy (@TukTuk_Academy) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
71st century - 2(7)
72th century - 1(5)
73rd century - 4(9)
74th century - 4(9)
75th century - 4(9)
76th century - 4(7)
77th century - 3(12) pic.twitter.com/rPQP1vmrWM
">Professor Kohli after scoring:-
— TukTuk Academy (@TukTuk_Academy) September 12, 2023
71st century - 2(7)
72th century - 1(5)
73rd century - 4(9)
74th century - 4(9)
75th century - 4(9)
76th century - 4(7)
77th century - 3(12) pic.twitter.com/rPQP1vmrWMProfessor Kohli after scoring:-
— TukTuk Academy (@TukTuk_Academy) September 12, 2023
71st century - 2(7)
72th century - 1(5)
73rd century - 4(9)
74th century - 4(9)
75th century - 4(9)
76th century - 4(7)
77th century - 3(12) pic.twitter.com/rPQP1vmrWM
Asia Cup 2023 IND VS SL : లంక స్పిన్ దెబ్బకు టీమ్ఇండియా విలవిల .. లక్ష్యం ఎంతంటే?