ETV Bharat / sports

Asia Cup 2023 Team India Squad : ఏంటి హార్దిక్​ కాదా.. ఆసియా కప్​ టీమ్​ఇండియా జట్టులో ఇదేం ట్విస్ట్​? - ఆసియాకప్ 2023 టీమ్ఇండియా వైస్ కెప్టెన్ బుమ్రా

Asia Cup 2023 Team India Squad : ఆసియా కప్‌ 2023 కోసం జట్టును ఎంపిక చేసే ప్రక్రియలో టీమ్‌ఇండియా సెలక్షన్​ కమిటీ బిజీగా ఉంది. ఇందుకోసం సెలక్షన్‌ కమిటీ సోమవారం దిల్లీలో సమావేశం కాబోతోంది. ఆ వివరాలు..

Rohith sharma Asai cup 2023
Asia Cup 2023 Team India Squad : హార్దిక్​ కాదా.. ఆసియా కప్​ టీమ్​ఇండియా జట్టులో ఇదేం ట్విస్ట్​?
author img

By

Published : Aug 20, 2023, 2:06 PM IST

Asia Cup 2023 Team India Squad : ఆసియా కప్​ 2023కి రంగం సిద్ధమైంది. ఈ నెల 30 నుంచి మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అయితే ఈ టోర్నీకి టీమ్​ను ప్రకటించేందుకు టీమ్‌ఇండియా సెలక్షన్ కమిటీ రెడీ అయింది. దీనికోసం అజిత్‌ అగార్కర్‌ ఆధ్వర్యంలోని సెలక్షన్‌ కమిటీ సోమవారం(ఆగస్ట్ 21) దిల్లీలో భేటీ కాబోతోంది. వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి కూడా ఇదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది. దీంతో ఏఏ ప్లేయర్స్​ను టీమ్​లోకి తీసుకుంటారనే విషయంపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెెలకొంది. అలాగే రోహిత్‌ శర్మ కెప్టన్​గా(asia cup 2023 team india captain) ఉండే టీమ్​కు వైస్‌ కెప్టెన్‌ ఎవరనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది.

వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలను హార్దిక్‌ పాండ్యకు అప్పగించకపోవచ్చని అంటున్నారు. మరో ప్లేయర్​ను సెలెక్ట్ చేస్తారని ప్రచారం సాగుతోంది. రీసెంట్​గా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి .. మొదటి ఓవర్‌లోనే బుమ్రా రెండు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. పునరాగమనాన్ని ఘనంగా చేసిన ఈ స్టార్‌ పేసర్​కే వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలకు బలమైన పోటీదారుడు అని పలువురు క్రికెట్​ నిపుణులు అభిమానులు అంటున్నారు.

"సీనియారిటీ పరంగా చూస్తే.. పాండ్యా కన్నా బుమ్రానే ముందున్నాడు. 2022లో ఉన్నప్పుడు టెస్టు టీమ్​కు సారథ్య బాధ్యతలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాడు. పాండ్యకు ముందు సౌతాఫిక్రా టూర్​లోనూ వన్డేల్లో వైస్‌ కెప్టెన్‌గానూ ఉన్నాడు. ఈ కారణంగానే ఆసియా కప్‌తో పాటు వరల్డ్​ కప్‌నకు బుమ్రాకు వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇచ్చే అవకాశముంది. కాబట్టి రోహిత్‌ శర్మకు.. బుమ్రా డిప్యూటీగా సెలెక్ట్ అయితే ఆశ్చర్యపోనవసరం లేదు. ఐర్లాండ్‌ టూర్​లో రుతురాజ్‌కు బదులు అతడినే సారథిగా నియమించడానికి కారణం ఉంది" అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఇకపోతే హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో రీసెంట్​గా ముగిసిన వెస్టిండీస్​ పర్యటనలో టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌ను కోల్పోయింది. దీంతో అతడు జట్టును నడిపించిన తీరుపై బాగానే విమర్శలు వినిపించాయి.

Asia Cup 2023 Team India Players List : అలానే ఆసియా కప్‌నకు అదనంగా ఇద్దరు ప్లేయర్లను సెలెక్ట్ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. సాధారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లకైనా, ఏదైనా టోర్నీకైనా 15 మంది సభ్యులతో టీమ్​ను సెలెక్ట్ చేస్తారు. కానీ ఈ సారి మాత్రం వరల్డ్​ కప్​ కోసం ముందు జాగ్రత్తగా.. ఆసియా కప్‌లోనే ఎక్కువ మంది ప్లేయర్లను తీసుకోబోతున్నారు. 17 మంది ప్లేయర్లను ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

ODI Worldcup 2023 : బీసీసీఐకి.. హెచ్​సీఏ, హైదరాబాద్​ పోలీసులు షాక్​!

Rohit Sharma Practice : గ్రౌండ్‌లో చెమటోడ్చిన హిట్ మ్యాన్​.. ఆ టోర్నీ కోసమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.